
Former Indian skipper Virat Kohli: గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగే సిరీస్‌లో జడేజా తిరిగి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రంలో గత కొంత కాలంగా జడేజా శిక్షణ పొందుతున్నాడు. అయితే ఇప్పటికే భారత్- శ్రీలంక తొలి టీ20 వేదిక అయిన లక్నోకు జడేజా చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జడేజాతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
జడేజా, బుమ్రా ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంతగా ఫామ్‌లో లేని కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీ20 సిరీస్ అనంతరం జరిగే టెస్ట్ సిరీస్‌కు కోహ్లి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు వన్డేల్లో మొత్తం కోహ్లి 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక విండీస్‌తో జరిగిన తొలి టీ20లోను కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విరాట్ పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: Ind VS Wi 2nd T20: వరుసగా 8, 18, 0, 17.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా!
Comments
Please login to add a commentAdd a comment