ఆసియా కప్ 2022 శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను మరో చోటుకు తరలించాలని ఐసీసీ యోచిస్తోన్నట్లు సమచారం. ఆదివారం(ఏప్రిల్ 17) దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) త్రైమాసిక సమావేశంలో" వేదిక మార్పుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటికే ఈటోర్నీకి అర్హత సాదించగా.. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ తర్వాత మరో జట్టు చేరుతుంది. ఇక చివరగా ఆసియా టీ20 కప్ 2016లో బంగ్లాదేశ్‌లో జరిగింది.
చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్.. 98 మీటర్ల భారీ సిక్సర్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment