చమరి అటపట్టు సూపర్‌ సెంచరీ | Super century by Chamari Atapattu | Sakshi
Sakshi News home page

చమరి అటపట్టు సూపర్‌ సెంచరీ

Published Tue, Jul 23 2024 4:01 AM | Last Updated on Tue, Jul 23 2024 4:01 AM

Super century by Chamari Atapattu

ఆసియా కప్‌ మహిళల టి20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. 

కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్‌; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టి20 కెరీర్‌లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement