నేడు యూఏఈతో భారత్ ఢీ
మహిళల ఆసియా కప్ టోర్నీ
దంబుల్లా: మహిళల ఆసియా కప్ టోరీ్నలో శనివారం శ్రీలంక, థాయిలాండ్ జట్లు విజయాలు నమోదు చేశాయి. మాజీ చాంపియన్ బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
అనంతరం లంక 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విష్మీ గుణరత్నే (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా...హర్షిత సమరవిక్రమ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించింది. మరో మ్యాచ్‌లో థాయిలాండ్ 22 పరుగుల తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ననపట్ కొంచరోంకయ్ (35 బంతుల్లో 40; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించింది.
ఆ తర్వాత మలేసియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది. వాన్ జూలియా (53 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా మిగతావారంతా విఫలమయ్యారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నేడు జరిగే తమ రెండో మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తమ తొలి పోరులో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment