Courtesy: IPL Twitter
ఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా డెబ్యూ చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తన వేసిన తొలి బంతికే వికెట్ సాధించడం విశేషం. శుభ్‌మాన్ గిల్‌ను పతిరనా ఎల్బీడబ్ల్యూ చేశాడు. అచ్చం శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ లాగే పతిరనా బౌలింగ్ చేస్తున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు, రషీద్ ఖాన్, జోషప్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(67) పరుగులతో రాణించాడు.
చదవండి: IPL 2022: 'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు'
A dream debut for Matheesha Pathirana 😍#MatheeshaPathirana #CSKvsGT #IPL2022 pic.twitter.com/D0bZn42fo5
— Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) May 15, 2022
Comments
Please login to add a commentAdd a comment