Malinga
-
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
తొలి బంతికే వికెట్ తీసిన జూనియర్ మలింగ.. వీడియో వైరల్
ఐపీఎల్లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా డెబ్యూ చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తన వేసిన తొలి బంతికే వికెట్ సాధించడం విశేషం. శుభ్‌మాన్ గిల్‌ను పతిరనా ఎల్బీడబ్ల్యూ చేశాడు. అచ్చం శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ లాగే పతిరనా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు, రషీద్ ఖాన్, జోషప్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(67) పరుగులతో రాణించాడు. చదవండి: IPL 2022: 'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు' A dream debut for Matheesha Pathirana 😍#MatheeshaPathirana #CSKvsGT #IPL2022 pic.twitter.com/D0bZn42fo5 — Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) May 15, 2022 -
టి20 ప్రపంచ కప్ తర్వాత వీడ్కోలు: మలింగ
ప్రిటోరియా: వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానని శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ లసిత్ మలింగ ప్రకటించాడు. ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు 35 ఏళ్ల మలింగ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఒక వికెట్ తీసిన మలింగ ఖాతాలో 97 వికెట్లు చేరాయి. 98 వికెట్లతో షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మలింగ మరో వికెట్ దూరంలో ఉన్నాడు. -
శ్రీలంక టి20 జట్టులో మలింగకు దక్కని చోటు
వెటరన్ స్పీడ్‌స్టర్ లసిత్ మలింగను భారత్‌తో టి20ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే శ్రీలంక జట్టును శుక్రవారం ప్రకటించారు. ఇందులో సీనియర్ ఆటగాళ్లు లక్మల్, తిరిమన్నెలకు విశ్రాంతి ఇవ్వగా... వీరి స్థానంలో విశ్వ ఫెర్నాండో, దాసున్ షనకలకు చోటిచ్చారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న మలింగకు విశ్రాంతి ఇచ్చినట్లు శ్రీలంక క్రీడల మంత్రి తెలిపారు. ఈ నెల 20న తొలి టి20 కటక్‌లో, తదుపరి మ్యాచ్‌లు 22న ఇండోర్‌లో, 24న ముంబైలో జరుగుతాయి. -
భువీ మరో అరుదైన ఘనత
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో వంద వికెట్లను సాధించిన క్లబ్ లో చేరిపోయాడు. సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువీ.. ఐపీఎల్ లో 100 వికెట్ల మార్కును చేరాడు. మరొకవైపు అతి తక్కువ మ్యాచ్ ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా అతి తక్కువ మ్యాచ్ ల్లో వంద వికెట్లను సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు. లసిత్ మలింగా 70 మ్యాచ్ లో ఈ ఘనత సాధించగా, భువీ 81 మ్యాచ్ ల్లో సాధించాడు. ఇదిలా ఉంచితే, 2014 నుంచి సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భువీ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఓటములకు అడ్డు గోడలా నిలిచి జట్టును విజయాల తీరం వైపు మళ్లిస్తున్నాడు. భువీ పొదుపు బౌలింగ్ తో స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ డంకా మోగిస్తుంది. 2016 సీజన్లో 17 మ్యాచ్ లు ఆడిన భువీ 23 వికెట్లతో అగ్రస్దానంలో నిలిచి జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోశించాడు. సన్ రైజర్స్ లో చేరిన తర్వాత భువీ తన బౌలింగ్ ప్రతిభను చాటాడు. 2014లో 20 మ్యాచ్ లు ఆడి 20 వికెట్లతో బౌలర్ల పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో నిలిచాడు. 2015 లో 18 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు అప్పటి జట్టు పుణే వారియర్స్ ఇండియా తరుపు ఆడి 25 వికెట్లు తీశాడు. 2008-2009 సీజన్ లో బెంగళూరుకు ఎంపికైన భువీకి అంతగా అవకాశం రాలేదు. -
ఆధిపత్యం కొనసాగేనా!
► నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ ► గెలిస్తే ఫైనల్‌కు అర్హత ► ధోని, రోహిత్ గాయాలపై సందిగ్ధత ► ఆసియా కప్ టి20 టోర్నీ దాదాపు రెండు వారాల క్రితమే ఇరు జట్లు ప్రత్యర్థులుగా తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఓడినా... ఆ తర్వాత భారత్ పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో లంకను చిత్తు చేసింది. దానికి కొనసాగింపుగానా అన్నట్లు ఆసియా వేదికపై ఈ జట్లు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. భారత జట్టులో ఎలాంటి మార్పు లేకపోయినా... లంక కొంత మంది సీనియర్ల చేరికతో కాస్త మెరుగైంది. అయినాగానీ వరుస విజయాలతో ఊపు మీదున్న ధోని సేనదే పైచేయిగా కనిపిస్తోంది. మరోసారి మన జట్టు ఆధిపత్యం కొనసాగిస్తుందా లేక లంక కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. మిర్పూర్: టి20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు అద్భుతంగా కొనసాగిస్తున్న భారత జట్టు అదే జోరులో మరో మ్యాచ్ విజయంపై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌లో భాగంగా నేడు (మంగళవారం) జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంకతో తలపడుతుంది. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించిన భారత్ ఉత్సాహంగా ఉండగా... యూఏఈపై గెలిచినా, బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో లంక ఆత్మవిశ్వాసం తగ్గింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మార్పులు ఉంటాయా... ఆస్ట్రేలియాతో మొదలు పెట్టి ఈ ఏడాది వరుసగా ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడిన భారత్ గత మ్యాచ్‌లో మాత్రమే శిఖర్ ధావన్ గాయపడటంతో తుది జట్టులో ఒక మార్పు చేసింది. అయితే నేటి మ్యాచ్‌లో ఆడే జట్టుపై మరింత సందేహం నెలకొంది. తొలి మ్యాచ్‌నుంచే వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ ధోని ఆడతాడా లేదా అనేది స్పష్టం కాలేదు. ధావన్ ఇంకా కోలుకోకపోగా... గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ కాలి బొటనవేలుకు గాయమైంది. మ్యాచ్‌కు ముందే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ కోలుకోకపోతే పార్థివ్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, రైనా మాత్రం తడబడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా కష్టపడి వికెట్ కాపాడుకోగలిగిన యువరాజ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు. వీరిద్దరికి ఇది మంచి అవకాశం. మరోవైపు బౌలింగ్‌లో వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడిన ఆశిష్ నెహ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే భువనేశ్వర్‌ను ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో మన పేస్ బలం బాగానే ఉంది. స్పిన్‌లో కూడా అశ్విన్, జడేజాలను లంక బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్ శర్మ హాజరు కాలేదు. ధోని, ధావన్ సాధనలో పాల్గొన్నా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలోనే నెట్స్‌లోకి వచ్చిన పార్థివ్ ఎక్కువ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మలింగ మళ్లీ దూరం! బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. భారత్ చేతిలోనూ ఓడితే ఆ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు క్షీణిస్తాయి. గత మ్యాచ్‌లో గాయంతో మలింగ ఆడకపోవడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. అతని గాయం తిరగబడిందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ సహచరుడు మ్యాథ్యూస్ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా మలింగ బరిలోకి దిగడం సందేహంగానే ఉంది. టోర్నీలో చండీమల్ మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన కనబర్చలేదు. సీనియర్లు దిల్షాన్, మ్యాథ్యూస్, పెరీరా కలిసికట్టుగా విఫలం అవుతుండటంతో లంక పరిస్థితి మరింత దిగజారింది. వీరిలో కనీసం ఇద్దరైనా ధాటిగా ఆడితే ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించగలుగుతుంది. బౌలింగ్‌లో కూడా కులశేఖర పెద్దగా ప్రభావం చూపలేకపోగా, హెరాత్ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సమస్య కాదు. మలింగ లేకపోతే ఆ జట్టు బౌలింగ్ మరీ బలహీనంగా మారిపోతుంది. దాంతో యువ ఆటగాళ్లు సిరివర్దన, షనక, చమీరాలు కీలకం కానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ/పార్థివ్, రహానే, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), చండీమల్, తిలకరత్నే దిల్షాన్, జయసూర్య, తిసారా పెరీరా, సిరివర్దన, షనక, కపుగెదెర, కులశేఖర, చమీరా, రంగన హెరాత్. పిచ్, వాతావరణం ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆరంభంలో ఇబ్బంది పడింది. అన్ని జట్ల పేసర్లు పిచ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో భారీగా పరుగులు రాలేదు. ఈసారి కూడా మార్పు లేకుండా దాదాపుగా అదే వికెట్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాస్ కీలకం కావచ్చు. వర్ష సూచన లేదు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు పెద్దగా అనుకూలించడం లేదనేది వాస్తవం. అయితే పరిస్థితులకు అనుగుణంగా మనం బౌలింగ్ మార్చుకోవాలి. టి20ల్లో వికెట్ తీయడమే కాదు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం కూడా ముఖ్యం. నేను అదే పని చేస్తున్నాను. చివరి ఓవర్లలో మా బౌలింగ్ పదును పెరిగింది. నెహ్రా అనుభవం ఎంతో ఉపయోగపడుతుండగా, బుమ్రా యార్కర్లు, భిన్నమైన యాక్షన్‌తో చెలరేగుతున్నాడు. ఎవరు విడిగా బాగా ఆడినా జట్టుగా మంచి ఫలితాలు సాధించడమే ముఖ్యం. శ్రీలంకతో చాలా ఎక్కువగా ఆడాం కాబట్టి ఇరు జట్లకూ ప్రత్యర్థి బలాబలాల గురించి బాగా తెలుసు. -అశ్విన్, భారత బౌలర్ పాటల పల్లకి... బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ అధికారిక నివాసంలో ఆదివారం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నంత సేపూ ఆటగాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడా తనదైన శైలిలో ఉత్సాహం ప్రదర్శించిన విరాట్ కోహ్లి ‘జో వాదా కియా వో నిభానా పడేగా’ అంటూ తాజ్‌మహల్ చిత్రంలోని పాటను భావుకతతో పాడేశాడు. నేనేం తక్కువ కాదన్నట్లు సురేశ్ రైనా కూడా తుమ్సే మిల్కే... (పరిందా) అంటూ తనలోని గాయకుడిని బయటపెట్టడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
మలింగ, హెరాత్‌లకు విశ్రాంతి
భారత్‌తో తొలి మూడు వన్డేలకు లంక జట్టు ప్రకటన కొలంబో: భారత్‌తో వన్డే సిరీస్‌లో శ్రీలంక నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. నవంబరు 2 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం లంక జట్టును ప్రకటించారు. స్టార్ పేసర్ మలింగతో పాటు ప్రధాన స్పిన్నర్ హెరాత్‌కూ విశ్రాంతి ఇచ్చారు. అలాగే మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మెన్ తిరిమన్నె, చండీమల్‌లను తప్పించారు. అయితే ఈ ఆకస్మిక సిరీస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగక్కర కూడా భారత్‌కు రావడం అనుమానంగానే ఉంది. జయసూర్య సారథ్యంలోని సెలక్టర్ల బృందం ప్రకటించిన జట్టులో సంగక్కర ఉన్నా... తను వెన్నునొప్పితో బాధపడుతున్నాడని సమాచారం. సంగక్కరతో పాటు తిషార పెరీరా కూడా గాయం కారణంగా భారత్‌కు రాకపోవచ్చు. పేసర్ గమాగేను తొలిసారి జట్టులోకి ఎంపిక చేశారు. తొలి మూడు వన్డేలకు శ్రీలంక జట్టు: మాథ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, తరంగ, సంగక్కర, జయవర్ధనే, ప్రియాంజన్, డిక్వెల్లా, తిషార పెరీరా, కులశేఖర, దమ్మిక ప్రసాద్, గమాగే, చతురంగ డిసిల్వ, ప్రసన్న, రణ్‌దివ్.