
వెటరన్ స్పీడ్‌స్టర్ లసిత్ మలింగను భారత్‌తో టి20ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే శ్రీలంక జట్టును శుక్రవారం ప్రకటించారు. ఇందులో సీనియర్ ఆటగాళ్లు లక్మల్, తిరిమన్నెలకు విశ్రాంతి ఇవ్వగా... వీరి స్థానంలో విశ్వ ఫెర్నాండో, దాసున్ షనకలకు చోటిచ్చారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న మలింగకు విశ్రాంతి ఇచ్చినట్లు శ్రీలంక క్రీడల మంత్రి తెలిపారు. ఈ నెల 20న తొలి టి20 కటక్‌లో, తదుపరి మ్యాచ్‌లు 22న ఇండోర్‌లో, 24న ముంబైలో జరుగుతాయి.