
ప్రిటోరియా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (46 బంతుల్లో 65; 9 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 164 పరుగులు చేసి ఓడిపోయింది. 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రీలంక ఆటగాడు ఇసురు ఉదాన (48 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయినా శ్రీలంకను గట్టెక్కించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్ (3/32), స్టెయిన్ (2/34), షమ్సీ (2/16) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment