
ప్రిటోరియా: వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానని శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ లసిత్ మలింగ ప్రకటించాడు. ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు 35 ఏళ్ల మలింగ వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఒక వికెట్ తీసిన మలింగ ఖాతాలో 97 వికెట్లు చేరాయి. 98 వికెట్లతో షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మలింగ మరో వికెట్ దూరంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment