శ్రీలంక టీమ్‌ వచ్చేసింది.. | Sri Lanka Team Arrives In India Ahead Of T20I Series | Sakshi
Sakshi News home page

శ్రీలంక టీమ్‌ వచ్చేసింది..

Published Thu, Jan 2 2020 4:14 PM | Last Updated on Thu, Jan 2 2020 4:14 PM

Sri Lanka Team Arrives In India Ahead Of T20I Series - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చేసింది. ఈ నెల 5వ తేదీన ఇరు జట్ల మధ్య జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. లంకేయుల జట్టుకు వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టుని బుధవారం ప్రకటించిన శ్రీలంక.. ఈరోజు ఉదయం భారత్‌లో అడుగుపెట్టింది. 

ఈ నెల 5న గౌహతి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 7న ఇండోర్, 10న పుణె వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్‌రౌండర్‌ ఎంజెలో మాథ్యూస్‌ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు.   32 ఏళ్ల మాథ్యూస్‌ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్‌ ఆడాడు.  

శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్‌ షనక, కుశాల్‌ పెరీరా,    డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్, సందకన్, కసున్‌ రజిత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement