పుణె: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లిని మరో వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. టీమిండియా కెప్టెన్‌గా 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించడానికి కోహ్లి పరుగు దూరంలో నిలిచాడు. శ్రీలంకతో మూడో టీ20లో కోహ్లి పరుగు సాధిస్తే కెప్టెన్‌గా పదకొండ వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఫలితంగా ఈ ఘనతను వేగవంతంగా సాధించిన కెప్టెన్‌గా కూడా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకూ కోహ్లి కెప్టెన్‌గా 168 మ్యాచ్‌ల్లో 10,999 పరుగులు సాధించాడు. ఒక పరుగు తీస్తే కెప్టెన్‌గా 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించడమే కాకుండా తన పేరిట కొత్త రికార్డును లిఖించుకుంటాడు. మరొకవైపు ఈ ఫీట్ సాధించిన ఆరో కెప్టెన్‌గా కోహ్లి నిలుస్తాడు. అదే సమయంలో భారత్ తరఫున ఎంఎస్ ధోని తర్వాత కెప్టెన్‌గా ఈ మార్కును చేరిన రెండో ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందుతాడు.
కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్), ఎంఎస్ ధోని(భారత్), అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. పాంటింగ్ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు. వీరి సరసన నిలిచేందుక కోహ్లి పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. శ్రీలంకతో చివరిదైన మూడో టీ20లో కోహ్లి ఈ ఘనతను చేరుకునే అవకాశం ఉంది. (ఇక్కడ చదవండి: కోహ్లి ఒక ఉఫ్.. అయ్యర్ మరొక ఉఫ్!)
Comments
Please login to add a commentAdd a comment