T20 World Cup 2021: Mahela Jayawardene Roped In As Consultant For Sri Lanka - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

Published Sat, Sep 25 2021 1:21 PM | Last Updated on Sat, Sep 25 2021 5:41 PM

T20 World Cup 2021: Mahela Jayawardene Roped In As Consultant For Sri Lanka - Sakshi

Mahela Jayawardene As Consultant For Sri Lanka:  వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనేను వరల్డ్‌కప్‌లో  మెదటి రౌండ్‌ మ్యాచ్‌లు కోసం కన్సల్టెంట్‌గా శ్రీలంక క్రికెట్‌ బోర్డు నియమించింది. ఆదే విధంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో  జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం అతడిని కన్సల్టెంట్‌, మెంటర్‌గా  ఎంపిక చేసింది.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌12కు ఆర్హత సాధించడానికి  శ్రీలంక మెదటి రౌండ్‌లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో తలపడనుంది. కాగా  2017 నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ హెడ్‌ కోచ్‌గా ఉన్న జయవర్ధనే ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించాడు. యూఏఈ వేదికగా జరగతున్న  ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌ ముగిసాక నేరుగా  జయవర్ధనే శ్రీలంక జట్టు బయోబబుల్‌లో చేరుతారని ఆ దేశ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement