Mumbai Indians coach
-
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్థనేను ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పగా...క్రికెట్ ఆపరేషన్ డైరక్టర్ జహీర్ ఖాన్‌ను ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా పదనోత్నతి కల్పించింది. ఈ క్రమంలో జయవర్థనే స్థానంలో ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ ప్రాధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. అయితే తాజగా ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సైమన్ కటిచ్ నియమితడయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ముంబై గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ జయవర్థనే.. బౌచర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై మరో వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం దక్షిణాప్రికా హెడ్‌కోచ్‌గా ఉన్న బౌచర్.. టీ20 ప్రపంచకప్ అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఇక గతంలో కూడా ఐపీఎల్లో కోచ్‌గా పనిచేసిన అనుభవం బౌచర్‌కు ఉంది. 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపింగ్ సలహాదారుగా అతడు పనిచేశాడు. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ కీలక నిర్ణయం! -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Mahela Jayawardene As Consultant For Sri Lanka: వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనేను వరల్డ్‌కప్‌లో మెదటి రౌండ్ మ్యాచ్‌లు కోసం కన్సల్టెంట్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఆదే విధంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం అతడిని కన్సల్టెంట్, మెంటర్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ సూపర్12కు ఆర్హత సాధించడానికి శ్రీలంక మెదటి రౌండ్లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో తలపడనుంది. కాగా 2017 నుంచి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్ధనే ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించాడు. యూఏఈ వేదికగా జరగతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ ముగిసాక నేరుగా జయవర్ధనే శ్రీలంక జట్టు బయోబబుల్‌లో చేరుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
సిరాజ్‌కు సిక్స్‌తో స్వాగతం
ముంబై: ఐపీఎల్ తాజా సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు సిక్స్‌తో స్వాగతం లభించింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన సిరాజ్ అందుకున్న తొలి ఓవర్ మొదటి బంతికి సిక్స్ సమర్పించుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌ను సిరాజ్ వేయగా, స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న లూయిస్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. సిరాజ్ ఆ తర్వాత మూడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా నియంత్రించినా, ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. ఆ బంతికి కాస్తా బౌండరీకి వెళ్లడంతో మొత్తం ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతిని ఫోర్ కొట్టిన లూయిస్.. చివరి బంతికి సింగిల్ తీశాడు. సిరాజ్ వేసిన ఒక్క ఓవర్లోనే 16 పరుగులు వచ్చాయి. -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేల
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను నియమించారు. రికీ పాంటింగ్ స్థానంలో మహేలను నియమిస్తున్నట్టు ముంబై జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ముంబై ఇండియన్స్ ట్విట్టర్ పేజీలో ఈ విషయం వెల్లడించింది. నాలుగు సీజన్లలో ముంబై కోచ్‌గా పాంటింగ్ వ్యవహరించాడు. వచ్చే ఏడాది మహేల బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మహేల గతంలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, కోచి టస్కర్స్ కేరళ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2014 టి-20 ప్రపంచ కప్ విజేత శ్రీలంక జట్టులో అతను సభ్యుడు. అలాగే 2007 వన్డే ప్రపంచ కప్‌లో మహేల సారథ్యంలో లంక ఫైనల్‌కు చేరింది. ముంబై జట్టు కోచ్‌గా నియమించినందుకు మహేల సంతోషం వ్యక్తం చేశాడు. ఆ జట్టుతో కలసి పనిచేస్తానని, విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తానని, కోచ్‌గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని మహేల అన్నాడు. అతను త్వరలో ముంబైకి వచ్చి జట్టు మేనేజ్మెంట్తో సమావేశం కానున్నాడు.