Sri Lanka Cricket Mahela Jayawardene Appointed Consultant Coach for 1 Year - Sakshi
Sakshi News home page

Mahela Jayawardhane: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి

Published Mon, Dec 13 2021 6:49 PM | Last Updated on Mon, Dec 13 2021 7:38 PM

Mahela Jayawardhane Appointed As Sri Lanka Consultant Coach - Sakshi

కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్‌ కోచింగ్‌ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్‌ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్‌ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే..  శ్రీలంక హెడ్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. 
చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement