Mahela Jayawardhane
-
'అందుకే రోహిత్‌ను తప్పించాం.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు'
ముంబై ఇండియన్స్‌లో ఒక శకం ముగిసింది. ముంబైను ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఇకపై ఒక సాధరణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఐపీఎల్- 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తప్పించింది. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కొత్త నాయకుడిగా ముంబై నియమించింది. ఇక కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే స్పందించాడు. 2024 సీజన్ నుంచే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే తెలిపాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్ కెప్టెన్లగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు. ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని జయవర్ధనే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
కింగ్ కోహ్లి అరుదైన ఘనత.. జయవర్ధనే రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో కోహ్లి తన 46 వన్డే సెంచరీని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జయవర్ధనే రికార్డు బద్దలు ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. అదే విధంగా శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ బ్యాటర్‌గా కూడా విరాట్ కోహ్లి(2503) నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2383) రికార్డును రన్‌మిషన్ బ్రేక్ చేశాడు. చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్థనేను ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పగా...క్రికెట్ ఆపరేషన్ డైరక్టర్ జహీర్ ఖాన్‌ను ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా పదనోత్నతి కల్పించింది. ఈ క్రమంలో జయవర్థనే స్థానంలో ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ ప్రాధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. అయితే తాజగా ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సైమన్ కటిచ్ నియమితడయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ముంబై గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ జయవర్థనే.. బౌచర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై మరో వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం దక్షిణాప్రికా హెడ్‌కోచ్‌గా ఉన్న బౌచర్.. టీ20 ప్రపంచకప్ అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఇక గతంలో కూడా ఐపీఎల్లో కోచ్‌గా పనిచేసిన అనుభవం బౌచర్‌కు ఉంది. 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపింగ్ సలహాదారుగా అతడు పనిచేశాడు. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ కీలక నిర్ణయం! -
"వరుసగా 7 మ్యాచ్‌ల్లో విఫలం.. త్వరలోనే కిషన్‌తో మాట్లాడతాను"
ఐపీఎల్-2022లోముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషన్ కిషన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో కిషన్ ఫామ్‌పై ముంబై జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. త్వరలో కిషన్‌తో తన ఫామ్ గురించి మాట్లాడతానని జయవర్ధనే తెలిపాడు. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. జట్టుతో పాటు స్టార్ బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమవుతున్నారు. "కిషన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అతడు తన సహజమైన ఆట ఆడటానికి మేము పూర్తి స్థాయిలో స్వేఛ్చను ఇచ్చాం. అయితే నేను ఇంకా కిషన్‌తో మాట్లాడలేదు. త్వరలోనే అతడి ఫామ్ గురించి మాట్లాడతాను. మా జట్టు బ్యాటర్ల ప్రదర్శనను నేను సమీక్షించుకోవాలి. అయితే ఇప్పటివరకు మా బాటర్ల ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. కానీ మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి.. రానున్న మ్యాచ్‌ల్లో రాణిస్తారని ఆశిస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో జయవర్ధనే పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: వరుస ఓటముల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ కీలక వ్యాఖ్యలు -
క్రికెటర్లకు షాకిచ్చిన బోర్డు... అలా జరగనట్లయితే జీతాల్లో కోత!
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ జట్టు ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జట్టు ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని, లేక పోతే వాళ్ల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్నికేవలం 8.10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ రన్ పూర్తిచేసే సమయం 8:55 దాటితే సదరు ఆటగాడిని సెలెక్షన్‌కు పరిగణించరు. 8:35 నుంచి 8:55 నిమిషాల్లో పూర్తి చేస్తే వాళ్ల జీతాల్లో కోత విధిస్తారు. ఇక వచ్చే ఏడాదిలో మొత్తంగా నాలుగు సార్లు యోయో టెస్ట్‌లను శ్రీలంక నిర్వహించనుంది. తొలి ఫిట్నెస్ టెస్ట్ జనవరి7న జరగనుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రవేశ పెట్టిన కొత్త రూల్స్ జనవరి 2022 నుంచి అమలులోకి రానున్నాయి. "ఇకపై ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్ని 8.10 నిమిషాలలోపు పూర్తి చేయాలి. ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఫిట్‌నెస్‌లో లోపాలను అసలు మేము సహించం" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక శ్రీలంక జట్టు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్‌లో పర్యటించనుంది. ఇక శ్రీలంక పురుషుల సీనియర్ జట్టుకు కన్సల్టింగ్ కోచ్‌గా మహేల జయవర్దనే ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్! -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!
Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. “మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Mahela Jayawardene As Consultant For Sri Lanka: వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనేను వరల్డ్‌కప్‌లో మెదటి రౌండ్ మ్యాచ్‌లు కోసం కన్సల్టెంట్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఆదే విధంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం అతడిని కన్సల్టెంట్, మెంటర్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ సూపర్12కు ఆర్హత సాధించడానికి శ్రీలంక మెదటి రౌండ్లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో తలపడనుంది. కాగా 2017 నుంచి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్ధనే ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించాడు. యూఏఈ వేదికగా జరగతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ ముగిసాక నేరుగా జయవర్ధనే శ్రీలంక జట్టు బయోబబుల్‌లో చేరుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
అతను బంతితో మ్యాజిక్ చేయడం చూడాలి: ముంబై కోచ్
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌ను చేజార్చుకున్న ముంబై ఇండియన్స్.. ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(కేకేఆర్, సన్‌రైజర్స్) విజయదుందుభి మోగించి గెలుపు బాట పట్టింది. ఏప్రిల్ 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్.. హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ జట్టు ప్రధాన కోచ్ మహేళ జయవర్ధనే మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బంతితో మ్యాజిక్ చేయడం చూడాలని ఉందని ఆకాంక్షించాడు. గాయం నుంచి కోలుకున్న చాలా కాలం తరువాత ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో హార్ధిక్ బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్ధిక్‌ను బౌలింగ్ చేయమనే సాహసం చేయలేమని, కానీ కొద్ది వారాల్లో అతను తిరిగి బంతిని అందుకోవడం చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన ముంబై తురుపు ముక్క సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా ప్రస్థావించాడు. సూర్యకుమార్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడని, అతను ముంబై ఇండియన్స్ ఆస్తి అని కొనియాడాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై జట్టు.. అతి త్వరలో అగ్రస్థానానికి ఎగబాకుతుందని ఆయన జోస్యం చెప్పాడు. ముంబై జట్టు తొలి మ్యాచ్ కోల్పోయి, తిరిగి గాడిలో పడిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశాడు. కాగా, హార్ధిక్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 42 వికెట్లు పడగొట్టాడు. అతను చివరిసారిగా 2019 సీజన్లో బౌలింగ్ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్లో 3 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో అతను బంతితోనైనా రాణించాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. చదవండి: బాగా బౌలింగ్ చేసినప్పుడు వికెట్ దక్కకపోతే ఆ బాధే వేరు.. -
భారత హెడ్ కోచ్ పదవి రేసులో జయవర్ధనే!
భారత క్రికెట్ హెడ్ కోచ్ పదవి కోసం శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. చివరి రోజైన మంగళవారం జయవర్ధనే దరఖాస్తు బీసీసీఐకి చేరినట్లు తెలిసింది. అతనితో పాటు మరో ఇద్దరు విదేశీయులు టామ్ మూడీ (ఆస్ట్రేలియా), మైక్ హెసన్ (న్యూజిలాండ్) కూడా కోచ్ పదవి రేసులో ఉన్నారని సమాచారం. భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కూడా ఇప్పటికే కోచ్ పదవిని ఆశిస్తూ బరిలో నిలిచాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వీరందరికీ హెడ్ కోచ్‌గా ఏమాత్రం అవకాశం ఉందనేది ఆసక్తికరం. -
టెస్టు క్రికెట్‌కు జయవర్ధనే గుడ్‌బై
పాకిస్థాన్‌తో సిరీసే ఆఖరు కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఆగస్టులో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్ అనంతరం అతడు టెస్టుల నుంచి తప్పుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన 37 ఏళ్ల జయవర్ధనే.. వన్డేల్లో మాత్రం కొనసాగుతాడని తెలిపింది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జయవర్ధనే కెరీర్లో145 మ్యాచ్‌లాడి 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్లతో సిరీస్‌లను కలిపితే అతని టెస్టుల సంఖ్య 149కి చేరనుంది. 18 ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని, కఠిన నిర్ణయమే అయినా.. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించినట్లు జయవర్ధనే తెలిపాడు. ఆమ్లా ‘కొత్త చరిత్ర’ గాలె: శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం ప్రారంభం కానున్న తొలిటెస్టులో చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. దక్షిణాఫ్రికా జట్టుకు తొలిసారిగా శ్వేత జాతీయేతర ఆటగాడు హషీం ఆమ్లా పూర్తిస్థాయి కెప్టెన్‌గా సారథ్యం వహించనున్నాడు. -
2015 వరల్డ్ కప్ తర్వాత సంగక్కర నిష్ర్కమణ!
ఢాకా: మరోవైపు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగక్కర 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. ఆ సమయానికి తాను 37 ఏళ్లకు చేరుకుంటాను కాబట్టి కొనసాగలేనని, ఇది సహజ పరిణామమని అతను స్పష్టం చేశాడు. ఇప్పటికే ట్వంటీ20 ల నుంచి రిటైర్ తీసుకుంటున్నటున్నట్లు జయవర్ధనే, సంగక్కరలు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేల సోమవారం ప్రకటించాడు. సంగక్కర రిటైర్మెంట్ ప్రకటన తర్వాతి రోజే జయవర్ధనే ఇది చెప్పడం విశేషం. శ్రీలంక జట్టు టి20 విజయాల్లో సంగక్కర, జయవర్ధనే కీలక పాత్ర పోషించారు. టి20ల్లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (166) సంగక్కర-జయవర్ధనే జోడి పేరిటే ఉంది. సంగక్కర సారథ్యంలో శ్రీలంక 2009 ప్రపంచ కప్ ఫైనల్లో... జయవర్ధనే కెప్టెన్సీలో 2012 ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది.