
భారత క్రికెట్ హెడ్ కోచ్ పదవి కోసం శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. చివరి రోజైన మంగళవారం జయవర్ధనే దరఖాస్తు బీసీసీఐకి చేరినట్లు తెలిసింది. అతనితో పాటు మరో ఇద్దరు విదేశీయులు టామ్ మూడీ (ఆస్ట్రేలియా), మైక్ హెసన్ (న్యూజిలాండ్) కూడా కోచ్ పదవి రేసులో ఉన్నారని సమాచారం. భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కూడా ఇప్పటికే కోచ్ పదవిని ఆశిస్తూ బరిలో నిలిచాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వీరందరికీ హెడ్ కోచ్‌గా ఏమాత్రం అవకాశం ఉందనేది ఆసక్తికరం.