IPL 2022: Mahela Jayawardene Says I Will Have a Conversation With Ishan Kishan Soon - Sakshi
Sakshi News home page

IPL 2022: "వ‌రుస‌గా 7 మ్యాచ్‌ల్లో విఫ‌లం.. త్వ‌ర‌లోనే కిష‌న్‌తో మాట్లాడతాను"

Published Mon, Apr 25 2022 5:22 PM | Last Updated on Mon, Apr 25 2022 5:36 PM

I will have a conversation with Ishan Kishan soon - Sakshi

ఐపీఎల్‌-2022లోముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ ఇష‌న్ కిష‌న్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ క్ర‌మంలో కిషన్ ఫామ్‌పై ముంబై జ‌ట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. త్వ‌ర‌లో కిష‌న్‌తో త‌న ఫామ్ గురించి మాట్లాడతానని జయవర్ధనే తెలిపాడు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది సీజ‌న్‌లో 8 మ్యాచ్‌ల్లోనూ ఓట‌మి చెంది పాయింట్ల ప‌ట్టిక‌లో అఖ‌రి స్థానంలో నిలిచింది. ఆదివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యం పాలైంది. జ‌ట్టుతో పాటు స్టార్ బ్యాట‌ర్లు కూడా దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు.

"కిష‌న్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది ప‌డుతున్నాడు. అత‌డు త‌న సహజమైన ఆట ఆడటానికి మేము పూర్తి స్థాయిలో స్వేఛ్చ‌ను ఇచ్చాం. అయితే నేను ఇంకా కిష‌న్‌తో మాట్లాడ‌లేదు. త్వ‌ర‌లోనే అత‌డి ఫామ్ గురించి మాట్లాడ‌తాను. మా జ‌ట్టు బ్యాట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను నేను సమీక్షించుకోవాలి. అయితే ఇప్పటివరకు మా బాట‌ర్ల ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. కానీ మా జ‌ట్టులో సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు కాబ‌ట్టి.. రానున్న మ్యాచ్‌ల్లో రాణిస్తార‌ని ఆశిస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో జయవర్ధనే పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: IPL 2022: వరుస ఓటముల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement