IPL 2022: Rohit Sharma Makes a BIG Statement after MI Loss 8th Match in a Row - Sakshi
Sakshi News home page

Rohit Sharma: వాళ్లు మెరుగ్గా ఆడాల్సింది.. నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్‌ ఫైర్‌!

Published Mon, Apr 25 2022 9:00 AM | Last Updated on Mon, Apr 25 2022 10:54 AM

IPL 2022 MI Vs LSG: Rohit Sharma Big Statement After Mumbai Loss Irresponsible - Sakshi

ముంబై ఇండియన్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 MI Vs LSG- Rohit Sharma Comments: ఐపీఎల్‌-2022 సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం చవిచూసింది ముంబై ఇండియన్స్‌ జట్టు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో  ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై నిష్క్రమించినట్లయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్‌స​ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్‌ యూనిట్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేదన్నాడు. 

నిర్లక్ష్యపు షాట్లు తమ కొంప ముంచాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అయినా మా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థి విధించిన లక్ష్యం మరీ అంత పెద్దదేమీ కాదు. అయితే, భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. నాతో సహా కొంత మంది బ్యాటర్ల నిర్లక్ష్యపు షాట్లు మా విజయావకాశాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టులోని బ్యాటర్లు ఇలాంటి బాధ్యత తీసుకున్నారు గనుకే మాకు భంగపాటు తప్పలేదు’’ అని బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు.

ఇక టిమ్‌ డేవిడ్‌కు అవకాశం రాకపోవడంపై రోహిత్‌ స్పందిస్తూ.. ‘‘ఓటములు ఎదురైనపుడు ఇలాంటి విషయాలు తప్పకుండా చర్చకు వస్తాయి. అయితే, ప్రతి ఒక్కరికి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌ తమకు అస్సలు కలిసి రావడం లేదని, ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోకతప్పదని వ్యాఖ్యానించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(8) మరోసారి విఫలం కాగా రోహిత్‌ శర్మ 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌(3), సూర్యకుమార్‌ యాదవ్‌(7) పూర్తిగా నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లతో తిలక్‌ వర్మ(38) ఒక్కడే కాస్త మెరుగ్గా రాణించాడు.
ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
లక్నో- 168/6 (20)
ముంబై- 132/8 (20

చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. రోహిత్ రికార్డు స‌మం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement