లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(PC: IPL/BCCI)
IPL 2022 MI Vs LSG: ముంబై ఇండియన్స్‌పై విజయంతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి 24 లక్షల రూపాయల మేర ఫైన్ విధించారు.
కాగా ఐపీఎల్-2022 సీజన్‌లో నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయకపోవడం లక్నోకు ఇది రెండోసారి. అందుకే సారథి రాహుల్‌కు ఈ మేరకు ఫైన్ పడింది. అతడితో పాటు ఆదివారం నాటి ముంబైతో మ్యాచ్‌లోని లక్నో తుదిజట్టులో గల ఆటగాళ్లందరి ఫీజులో 25 శాతం(6 లక్షలు) మేర కోత విధించారు.
ఇక రాహుల్ జట్టు గనుక మరోసారి ఈ తప్పును పునరావృతం చేస్తే కెప్టెన్ రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. అదే విధంగా తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
ఇక ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత రెండోసారి ఫైన్ బారిన పడిన సారథిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే ముంబైతో మ్యాచ్‌లో లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. కెప్టెన్ రాహుల్ అద్బుత సెంచరీ(62 బంతుల్లో 103 పరుగులు)తో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ముంబై ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం నమోదు చేసింది.
ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు:
లక్నో- 168/6 (20)
ముంబై- 132/8 (20
That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians
— IndianPremierLeague (@IPL) April 24, 2022
Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi
That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians
— IndianPremierLeague (@IPL) April 24, 2022
Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi
Comments
Please login to add a commentAdd a comment