PC: IPL.com
ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో రాహుల్ 103 పరుగులు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా ముంబై ఇండియన్స్‌పై కావడం విశేషం. ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ సాధించాడు.
ఈ క్రమంలో అరుదైన రికార్డులను తన పేరిట రాహుల్ లిఖించుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ(6) రికార్డును రాహుల్ రాహుల్ సమం చేశాడు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు, ఐపీఎల్ 4 సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. ఐదు సెంచరీలతో కోహ్లి తొలి స్థానంలో ఉండగా, రాహుల్ 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: KL Rahul T20 Runs: కేఎల్ రాహుల్ కొత్త రికార్డు.. టీమిండియా తరపున అత్యంత వేగంగా
Comments
Please login to add a commentAdd a comment