
PC: IPL
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనం�...
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
Published Sun, Apr 24 2022 7:05 PM | Last Updated on Mon, Apr 25 2022 11:20 AM
PC: IPL
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో లైవ్ అప్డేట్స్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. వరుసగా ఎనిమిదో ఓటమి చవి చూసింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పాలైంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(39), తిలక్ వర్మ(38) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు, బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఇక ముంబై బౌలర్లలో మెరిడిత్, పొలార్డ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సామ్స్, బుమ్రా తలా వికెట్ పడగొట్టారు.
124 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన తిలక్ వర్మ.. హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 44 పరుగులు కావాలి.
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(32), పొలార్డ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 59 పరుగులు కావాలి.
68 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బదోని బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వరుస క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మోషిన్ ఖాన్ బౌలింగ్‌లో బ్రేవిస్(3) ఔట్ కాగా..తర్వాతి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్ శర్మ(39) ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్ 66/3
49 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన కిషన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్ 54 /1
మూడు ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 18 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(9), కిషన్(3) పరుగులతో ఉన్నారు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో 103 పరుగులు చేసి రాహుల్ అజేయంగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. అది కూడా ముంబై ఇండియన్స్‌పై కావడం గమనార్హం.
దీంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఇక ముంబై బౌలర్లలో మెరిడిత్, పొలార్డ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సామ్స్, బుమ్రా తలా వికెట్ పడగొట్టారు.
121 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ ఐదో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా.. మెరిడిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్(71), బదోని ఉన్నారు.
103 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. పొలార్డ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా ఔటయ్యాడు. 14 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 108/4
102 పరుగుల వద్ద స్టోయినిష్ (0) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. సామ్స్ బౌలింగ్‌లో పాండే ఔటయ్యాడు.
85 పరుగుల వద్ద మనీష్ పాండే(22) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. పొలార్డ్ బౌలింగ్‌లో పాండే ఔటయ్యాడు.
11 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 82/1, క్రీజులో రాహుల్(50), మనీష్ పాండే(21) పరుగులతో ఉన్నారు.
7 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్: 38/1, క్రీజులో రాహుల్(24), మనీష్ పాండే(4) పరుగులతో ఉన్నారు.
27 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన డికాక్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్(17), మనీష్ పాండే ఉన్నారు.
మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా లక్నో సూపర్ జెయింట్స్ 20 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ (16), డికాక్(4) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2022లో మరో ఆసక్తకిర పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment