ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేల | Mahela Jayawardene replaces Ricky Ponting as Mumbai Indians coach | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేల

Published Fri, Nov 18 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేల

ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేల

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనేను నియమించారు. రికీ పాంటింగ్‌ స్థానంలో మహేలను నియమిస్తున్నట్టు ముంబై జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ముంబై ఇండియన్స్ ట్విట్టర్‌ పేజీలో ఈ విషయం వెల్లడించింది.

నాలుగు సీజన్లలో ముంబై కోచ్‌గా పాంటింగ్‌ వ్యవహరించాడు. వచ్చే ఏడాది మహేల బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మహేల గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్, కోచి టస్కర్స్‌ కేరళ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2014 టి-20 ప్రపంచ కప్‌ విజేత శ్రీలంక జట్టులో అతను సభ్యుడు. అలాగే 2007 వన్డే ప్రపంచ కప్‌లో మహేల సారథ్యంలో లంక ఫైనల్‌కు చేరింది.

ముంబై జట్టు కోచ్‌గా నియమించినందుకు మహేల సంతోషం వ్యక్తం చేశాడు. ఆ జట్టుతో కలసి పనిచేస్తానని, విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తానని, కోచ్‌గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని మహేల అన్నాడు. అతను త్వరలో ముంబైకి వచ్చి జట్టు మేనేజ్‌మెంట్‌తో సమావేశం కానున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement