T20 World Cup 2021: లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్‌ | T20 World Cup 2021: Sri Lanka Vs Ireland Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

T20 WC 2021 SL Vs IRE: లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్‌

Published Wed, Oct 20 2021 7:09 PM | Last Updated on Wed, Oct 20 2021 11:10 PM

T20 World Cup 2021: Sri Lanka Vs Ireland Live Updates And Highlights In Telugu - Sakshi

లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్‌..70 పరుగుల తేడాతో ఘన విజయం
172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌ లంక బౌలర్ల ధాటికి 101 పరుగులకే కుప్పకూలింది. మహీశ్‌ తీక్షణ 3 వికెట్లతో విజృంభించగా.. కరుణరత్నే, లహిరు కుమార చెరో 2 వికెట్లు.. చమీరా, హసరంగ తలో వికెట్‌ పడగొట్టి ఐర్లాండ్‌ను ఆలౌట్‌ చేశారు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ(41), కర్టిస్‌ కాంఫర్‌(24) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఈ విజయంతో శ్రీలంక సూపర్‌-12 స్టేజ్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

ఐర్లాండ్‌ టార్గెట్‌ 172.. 5 ఓవర్ల తర్వాత 33/3
172 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు లంక బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. తొలి ఓవర్‌లో కరుణరత్నే.. కెవిన్‌ ఓ బ్రయాన్‌(5)ను, 3వ ఓవర్‌లో తీక్షణ.. పాల్‌ స్టిర్లింగ్‌(7)ను, 5వ ఓవర్‌లో హసరంగ.. గ్యారెత్‌ డెలానీ(2)ని ఔట్‌ చేశారు. 5 ఓవర్ల తర్వాత ఐర్లాండ్‌ స్కోర్‌ 33/3.

హసరంగ, నిస్సంక అర్ధ శతకాలు.. ఐర్లాండ్‌ టార్గెట్‌ 172
8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను వనిందు హసరంగ(47 బంతుల్లో 71; 10 ఫోర్లు, సిక్స్‌), పథుమ్‌ నిస్సంక(47 బంతుల్లో 61; 3 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్‌ దసున్‌ శనక(11 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) వేగంగా ఆడడంతో నిర్ణీత ఓవర్ల ముగిసే సరికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో జాషువా లిటిల్‌ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్‌ అదైర్‌ 2, పాల్‌ స్టిర్లింగ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 80/3
8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టును వనిందు హసరంగ(33 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌), పథుమ్‌ నిస్సంక(25 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 80/3. 

8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
ఐర్లాండ్‌ బౌలర్లు జాషువా లిటిల్‌(2/4), పాల్‌ స్టిర్లింగ్‌(1/4) ధాటికి శ్రీలంక జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగగా.. దినేశ్‌ చండీమాల్‌ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. 1.4 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 8/3. క్రీజ్‌లో వనిందు హసరంగ, పథుమ్‌ నిస్సంక(2) ఉన్నారు.

అబుదాబీ: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో శ్రీలంక, ఐర్లాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
తుది జట్లు: 
శ్రీలంక: కుశాల్‌ పెరీరా(వికెట్‌ కీపర్‌), పాథుమ్‌ నిషంక, దినేశ్‌ చండిమాల్‌, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్‌ షనక(కెప్టెన్‌), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్‌ తీక్షణ, లాహిరు కుమార.
ఐర్లాండ్‌: పాల్‌ స్టిర్లింగ్, కెవిన్‌ ఒబ్రెయిన్‌, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), గరేత్‌​ డిలనీ, కర్టిస్‌ కాంపర్‌, హ్యారి టెక్టార్‌, నీల్‌ రాక్(వికెట్‌ కీపర్‌)‌, సిమీ సింగ్‌, మార్క్‌ అదేర్‌, క్రెయిగ్‌ యంగ్‌, జోషువా లిటిల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement