
న్యూఢిల్లీ: ఈ ఏడాదిని కొత్తగా ఆరంభించాలనే ఉద్దేశంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తాజాగా టాప్ కట్ అని పిలవబడే హెయిర్ కట్‌ను కోహ్లి చేయించుకున్నాడు. శ్రీలంకతో ఆదివారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో కోహ్లి.. ఇలా తన కొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమయయాడు. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హాకీమ్‌తో కోహ్లి టాప్ కట్ చేయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను హకీమ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
దీనిపై బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ‘టెర్రిఫిక్’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు, వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న కోహ్లి.. తన టాప్ హెయిర్ కట్‌తో ఒక మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు విన్నూత్నమైన స్టైల్‌ను అవలంభించడం కోహ్లికి అలవాటు. ఎప్పుడూ తన లుక్‌తో కొత్తగా కనిపించే కోహ్లికి ఈ లుక్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూద్దాం. గతేడాదిని ఘనంగా ముగించిన టీమిండియా.. ఈ ఏడాదిలో శ్రీలంకపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది.