
ఫైల్ ఫోటో
కోలంబో: భారత యువ ఓపెనర్ పృధ్వీ షా తన టీ20 ఆరంగ్రేట్ర మ్యాచ్‌లో భారత అభిమానులను నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ఆడిన తొలి బంతికే డౌకౌట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. తద్వారా గోల్డెన్ డకౌట్ అపప్రథను మూటగట్టుకున్నాడు. చమీరా వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంతికే కీపర్ క్యాచ్ తో పృథ్వీ షా ఔట్ అయ్యి వెనుతిరిగాడు.
కాగా ఆరంగ్రేట్ర మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన రెండో భారత ఆటగాడుగా రికార్డు నమోదు చేశాడు. ఇంతకు ముందు కెఎల్ రాహుల్ ఆరంగ్రేట్రం టీ20 మ్యాచ్‌లో ఇలానే గోల్డెన్ డక్ అయ్యాడు. 2016లో జింబావ్వేపై కెఎల్ రాహుల్ గోల్డెన్ డక్ కాగా, రెండో భారత ఆటగాడిగా పృథ్వీ షా చేరాడు.
కాగా, ఇటీవల లంకేయులతో ముగిసిన వన్డే సిరీస్‌లో పృథ్వీ షా పర్వాలేదనిపించాడు. తొలి వన్డేలో 43, రెండో వన్డేలో 13, మూడో వన్డేలో 49 పరుగులు చేశాడు. ఆ వన్డే సిరీస్‌లో 20 బౌండరీల సాయంతో 105 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment