Senanayake
-
లంక మాజీ క్రికెటర్ సేనానాయకే అరెస్ట్
కొలంబో: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకేను క్రీడా అవినీతి దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. 2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లను సంప్రదించి మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడనేది అతనిపై ప్రధాన ఆరోపణ. ఇదే ఆరోపణలపై అతడు దేశం విడిచి వెళ్లరాదంటూ మూడు వారాల క్రితమే కోర్టు ఆదేశించింది. సెపె్టంబర్ 15 వరకు సేనానాయకే పోలీసులలో అదుపులో ఉంటాడు. అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు కానుంది. 38 ఏళ్ల సేనానాయకే ఆఫ్ స్పిన్నర్‌గా 2012–2016 మధ్య శ్రీలంకకు ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి మొత్తం 78 వికెట్లు పడగొట్టాడు. 2014లో టి20 వరల్డ్ కప్ నెగ్గిన లంక జట్టులో అతను సభ్యుడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. -
మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్ విన్నర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ దేశపు క్రీడా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లోంగిపోయాడు. అతడిని త్వరలోనే కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్ సేనానాయకే కావడం గమనార్హం. లంక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్‌బ్యాన్ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులను అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ పొందింది. అటార్నీ జనరల్ ఆదేశాల మెరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్పై నేరారోపణలు మోపింది. ఈ క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. ఇక 28 ఏళ్ల సేనానాయకే శ్రీలంక తరపున 49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టులో సేనానాయకే భాగంగా ఉన్నాడు. చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్ ఫైర్ -
శ్రీలంక స్పిన్నర్ సేననాయకేపై నిషేధం
కొలంబో: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్రా సేననాయకేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది. గత మేలో ఇంగ్లండ్ పర్యటనలో సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినందుకు ఐసీసీ అతనిపై నిషేధం విధించింది. సేననాయకేపై నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంగ్లండ్‌లోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్కూల్ లంక స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి నివేదికను ఐసీసీకి సమర్పించింది. సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలడంతో వేటు వేశారు. -
సేననాయకే ‘మన్కడింగ్’
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా లంక స్పిన్నర్ సేననాయకే మన్కడింగ్ చేయడం చర్చకు దారితీసింది. 43వ ఓవర్లో జాస్ బట్లర్‌ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి సేననాయకే రనౌట్ చేశాడు. దీన్ని కెప్టెన్ మాథ్యూస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. మన్కడింగ్‌తో సేననాయకే క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీశాడని మాజీ ఆటగాళ్లు విమర్శలకు దిగినా... తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే చేశామని కెప్టెన్ వివరణ ఇచ్చాడు. అంతకుముందే రెండుసార్లు బట్లర్‌ను హెచ్చరించినా వినలేదని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో మన్కడింగ్‌తో ఓ ఆటగాడిని అవుట్ చేయడం ఇది ఎనిమిదోసారి.