సేననాయకే ‘మన్కడింగ్’
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా లంక స్పిన్నర్ సేననాయకే మన్కడింగ్ చేయడం చర్చకు దారితీసింది. 43వ ఓవర్‌లో జాస్ బట్లర్‌ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి సేననాయకే రనౌట్ చేశాడు.
దీన్ని కెప్టెన్ మాథ్యూస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. మన్కడింగ్‌తో సేననాయకే క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీశాడని మాజీ ఆటగాళ్లు విమర్శలకు దిగినా... తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే చేశామని కెప్టెన్ వివరణ ఇచ్చాడు. అంతకుముందే రెండుసార్లు బట్లర్‌ను హెచ్చరించినా వినలేదని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మన్కడింగ్‌తో ఓ ఆటగాడిని అవుట్ చేయడం ఇది ఎనిమిదోసారి.