Buttler
-
ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2021 సీజన్ రెండో దశ చేరువవుతుండగా వేర్వేరు కారణాలతో జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ అత్యంత కీలక ఆటగాడిని కోల్పోయింది. వికెట్ కీపర్ జాస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే అతని భార్య ప్రసవం ఉండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే రాజస్తాన్ జట్టు ఆర్చర్ సేవలు కోల్పోగా...స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడేది కూడా సందేహంగానే మారింది. బట్లర్ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాయల్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటకు పేరుపొందిన ఫిలిప్స్ కివీస్ జట్టు తరఫున 25 టి20ల్లో 149.70 స్ట్రైక్‌రేట్‌తో 506 పరుగులు సాధించాడు. తొలి సింగపూర్ ఆటగాడు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టీమ్ కూడా యూఏఈ చేరుకుంది. శనివారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ టీమ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ పర్యవేక్షణలో సాధన చేశాడు. -
IPL 2021, RR vs SRH: అదే కథ... అదే వ్యథ
న్యూఢిల్లీ: అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో ఆరో ఓటమిని ఆహ్వానించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. డేవిడ్ వార్నర్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి విలియమ్సన్కు పగ్గాలు అప్పగించినా హైదరాబాద్ తలరాత మారలేదు. తొలుత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. బట్లర్ (64 బంతుల్లో 124; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ సామ్సన్ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి ఓడింది. మనీశ్ పాండే (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్ లు), బెయిర్ స్టో (21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ముస్తఫిజుర్ (3/20), మోరిస్ (3/29) హైదరాబాద్‌కు కళ్లెం వేశారు. బట్లర్ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. రషీద్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్ (12) ఆ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతి బట్లర్ ప్యాడ్లకు తగిలింది. రషీద్ అప్పీల్ చేసినా అంపైర్ తిరస్కరించాడు. అయితే అప్పటికే సన్‌రైజర్స్ తమ వద్ద ఉన్న ఒక్క రివ్యూను కోల్పోవడంతో మళ్లీ రివ్యూ కోరలేకపోయింది. టీవీ రిప్లేలో మాత్రం బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపిం చింది. అప్పటికి బట్లర్ ఏడు పరుగులతో ఉన్నాడు. యశస్వి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సామ్సన్ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో బట్లర్ కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఇక్కడి నుంచి గేర్ మార్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకదశలో 30 బంతుల్లో 32 పరుగులు చేసిన అతను... నబీ వేసిన 15వ ఓవర్లో 6, 4, 4, 6 బాదాడు. మరోవైపు శంకర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన సామ్సన్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 150 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 17వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన బట్లర్ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టి20 కెరీర్లో అతడికిదే తొలి శతకం. సందీప్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6, 6 కొట్టిన అతను ఆ ఓవర్ చివరి బంతికి బౌల్డయ్యాడు. చివరి 10 ఓవర్లలో రాజస్తాన్ 143 పరుగులు సాధించింది. ఆరంభం లభించినా... కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్‌కు తుది జట్టులోనూ చోటు దక్కలేదు. దాంతో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన మనీశ్ పాండే... బెయిర్‌స్టోతో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. లక్ష్యం భారీగా ఉండటంతో వీరిద్దరూ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. పవర్‌ప్లేలో హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఈ దశలో ముస్తఫిజుర్ హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. స్లో డెలివరీతో మనీశ్‌ను బోల్తా కొట్టించాడు. దూకుడు మీదున్న బెయిర్‌స్టో... తెవాటియా బౌలింగ్‌లో లాంగాన్ దగ్గర రావత్ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విలియమ్సన్ (21 బంతుల్లో 20, 1 ఫోర్), విజయ్ శంకర్ (8) వెంటవెంటనే అవుటయ్యారు. నబీ (5 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. దాంతో 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 129/5గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆడకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) సందీప్ శర్మ 124; జైస్వాల్ (ఎల్బీ) (బి) రషీద్ ఖాన్ 12; సామ్సన్ (సి) సమద్ (బి) విజయ్ శంకర్ 48; పరాగ్ (నాటౌట్) 15; మిల్లర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–17, 2–167, 3–209. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 37–0, సందీప్ శర్మ 4–0–50–1, రషీద్ 4–0–24–1, ఖలీల్ 4–0– 41–0, శంకర్ 3–0– 42–1, నబీ 1–0–21–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పాండే (బి) ముస్తఫిజుర్ 31; బెయిర్‌స్టో (సి) రావత్ (బి) తెవాటియా 30; విలియమ్సన్ (సి) మోరిస్ (బి) కార్తీక్ త్యాగి 20; విజయ్ శంకర్ (సి) మిల్లర్ (బి) మోరిస్ 8; జాదవ్ (బి) మోరిస్ 19; నబీ (సి) రావత్ (బి) ముస్తఫిజుర్ 17; సమద్ (సి) రావత్ (బి) మోరిస్ 10; రషీద్ (సి) మోరిస్ (బి) ముస్తఫిజుర్ 0; భువనేశ్వర్ (నాటౌట్) 14; సందీప్ శర్మ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–57, 2–70, 3–85, 4–105, 5–127, 6–142, 7–142, 8–143. బౌలింగ్: త్యాగి 4–0–32–1, ముస్తఫిజుర్ 4–0–20–3, సకారియా 4–0– 38–0, మోరిస్ 4–0–29–3, తెవాటియా 4–0–45–1. -
IND vs ENG 3rd ODI: ఆఖరి పోరాటం
స్వదేశంలో వన్డేల్లో ఎంత స్కోరు చేస్తే భారత జట్టు సురక్షితంగా ఉండవచ్చు? ఇంగ్లండ్ లాంటి మేటి జట్టు ముందు 336 పరుగుల స్కోరు కూడా సరిపోదని రెండో వన్డేలోనే అర్థమైంది. బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా భారీ స్కోరు చేస్తే... ప్రపంచ చాంపియన్ జట్టు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడి దానిని అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండగకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గత మ్యాచ్ అనుభవంతో వ్యూహం మార్చి విజయాన్ని అందుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ఈ పర్యటనలో చివరి మ్యాచ్‌లో నెగ్గి ఒక్క ఫార్మాట్లోనైనా విజేతగా వెనుదిరగాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. పుణే: భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన చివరి ఘట్టానికి చేరింది. టెస్టు, టి20 సిరీస్‌ల తర్వాత వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా ... ఈ పోరుతో అంతిమ విజయం ఎవరిదో తేల నుంది. గత మ్యాచ్ అందించిన ఫలితంతో ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం పెరగ్గా... భారత్ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. చహల్‌కు చాన్స్! 336 పరుగులు సాధించిన జట్టులో బ్యాటింగ్ లోపాల గురించి చెప్పడానికేమీ ఉండదు. అయితే తుది ఫలితం చూస్తే భారత జట్టు మరిన్ని పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయిందని అనిపించింది. మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదిగా ఆడటం కూడా ఇందుకు కారణం. ముఖ్యంగా మొయిన్ అలీలాంటి సాధారణ స్పిన్నర్ బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడటం కూడా కొంప ముంచింది. చివరి ఓవర్లలోనే కాకుండా అంతకుముందు నుంచే దూకుడు కనబర్చాలని భారత్ భావిస్తోంది. టాప్–3 రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లిలతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా... కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటడం జట్టుకు అదనపు బలాన్నిచ్చింది. ఇక రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడుతుండటం, హార్దిక్ పాండ్యా మెరుపు ప్రదర్శనలు కూడా జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించడం ఖాయం. పేస్ బౌలింగ్‌లో మరోసారి భువనేశ్వర్‌పైనే భారం ఉంది. ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. అయితే చివరి మ్యాచ్‌లో వైవిధ్యం కోసం వీరిద్దరిలో ఒకరిని తప్పించి నటరాజన్‌ను తీసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ పేస్‌తో పాటు యార్కర్ల బలంతో నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడని మేనేజ్మెంట్ నమ్ముతోంది. అయితే అన్నింటికంటే భారత్‌కు ఆందోళన కలిగించే అంశం స్పిన్ విభాగం. గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, కృనాల్ పాండ్యా కలిసి 16 ఓవర్లలో 156 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, 14 సిక్సర్లు సమర్పించుకున్నారు! ఈ నేపథ్యంలో కుల్దీప్ స్థానంలో యజువేంద్ర చహల్ రావడం ఖాయమైంది. టి20ల్లో చహల్‌ను చితక్కొట్టినా... ప్రస్తుతం కుల్దీప్ పరిస్థితి చూస్తే అంతకంటే కొంతైనా మెరుగ్గా బౌలింగ్ చేయగలడని అనిపిస్తోంది. కృనాల్ స్థానంలో సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్లు పడగొట్టకపోయినా... బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం సుందర్‌కు ఉంది. మరోవైపు హార్దిక్‌తో బౌలింగ్ చేయించే ఆలోచన లేదని కోహ్లి స్పష్టంగా చెప్పేయడంతో ప్రత్యామ్నాయానికి అవకాశం లేకుండా ఐదుగురు బౌలర్లే పూర్తి కోటాతో జట్టును నడిపించాల్సి ఉంది. ఓపెనర్లపైనే దృష్టి... ‘భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనూ, ఛేదించడంలోనూ మేం చాలా కాలంగా ఒక శైలిని ఏర్పరుచుకున్నాం. ఫలితాలతో సంబంధం లేకుండా వాటిని కొనసాగిస్తాం’ ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్య ఇది. గత మ్యాచ్‌లో అతను ఆడకపోయినా బట్లర్ నేతృత్వంలోని టీమ్ దానిని కొనసాగించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా ఉన్న జేసన్ రాయ్, బెయిర్‌స్టో జోరుతో ఇంగ్లండ్‌కు అద్భుత ఆరంభాలు లభిస్తున్నాయి. తొలి వన్డేలో గెలుపు అవకాశాన్ని వృథా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం అదే పునాదిపై చెలరేగి గెలుపు తీరం చేరింది. ఒక్కసారి కుదురుకుంటే తాను ఎంత ప్రమాదకారినో స్టోక్స్ చూపించాడు. మలాన్, బట్లర్, లివింగ్‌స్టోన్‌లు బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించగలరు. తర్వాత వచ్చే ఇద్దరు ఆల్‌రౌండర్లు అలీ, స్యామ్ కరన్‌లు కూడా పరుగులు సాధించగలరు కాబట్టి జట్టు బ్యాటింగ్ లోతు ఎలాంటిదో తెలుస్తోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు అలీ, రషీద్ తమ వంతు బాధ్యతలు సమర్థంగా పోషిస్తున్నారు. స్యామ్ కరన్, టాప్లీలు పేస్ భారం మోస్తారు. ఫిట్నెస్ సమస్యలతో రెండో మ్యాచ్ ఆడని మార్క్ వుడ్ మళ్లీ బరిలోకి దిగితే అతని పేస్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన టామ్ కరన్ స్థానంలో వుడ్ ఆడతాడు. మొత్తంగా చూస్తే బౌలింగ్‌లో కొన్ని సమస్యలు ఉన్నా...బ్యాటింగ్ బలగం ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలబెడుతోంది. పిచ్, వాతావరణం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. గత రెండు వన్డేల్లాగే మళ్లీ భారీ స్కోర్లకు మంచి అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ మరీ సులువుగా మారిపోతోంది కాబట్టి మరోసారి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్, సుందర్, శార్దుల్/నటరాజన్, భువనేశ్వర్, కుల్దీప్/చహల్, ప్రసిధ్ కృష్ణ. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, ఆదిల్ రషీద్, టాప్లీ, వుడ్. -
ట్రాఫిక్ పోలీస్ ‘మన్కడింగ్’
బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అశ్విన్ ఔట్ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ కారణంగా బతికిపోయిన ఫఖర్ జమాన్ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. -
ముంబైకి షాకిచ్చిన బట్లర్
-
గెలిచేదాకా నడిపించాడు
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ! మూడు సార్లు చాంపియన్ జట్టు ప్లే ఆఫ్ ఆశలకు దాదాపు తెరదించేలా రాజస్తాన్ రాయల్స్ షాకిచ్చింది. మ్యాచ్‌కు ముందు అన్నీ గెలిస్తే ముందుకు వెళ్లొచ్చులే అనుకున్న రోహిత్ సేన అంచనాలను బట్లర్ మరో సూపర్ ఇన్నింగ్స్‌తో తుంచేశాడు. దీంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. ముంబై: బట్లర్ మళ్లీ కదంతొక్కాడు. రాజస్తాన్ రాయల్స్‌ను గెలిచేదాకా నడిపించాడు. నిలకడకు వేగం జోడించే ఈ ఓపెనర్ అజేయ పోరాటంతో రాయల్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లూయిస్ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (31 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. స్టోక్స్, ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (53 బంతుల్లో 94 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన ఇచ్చాడు. కెప్టెన్ రహానే (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బౌండరీలతో మొదలైంది...కానీ టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంటే... బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, లూయిస్ బౌండరీలతో దడదడ లాడించారు. క్రిష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్లో యాదవ్ 2, లుయీస్ ఒక ఫోర్ బాదాడు. ఆరంభం నుంచే పుంజుకున్న ముంబై ఇన్నింగ్స్ ఓవర్‌కు 8 పరుగులు చొప్పున సాగింది. దీంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసేటప్పటికే ఏకంగా ఆరుగురు బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. తొమ్మిదో ఓవర్లో లూయిస్ సిక్సర్లతో వేగం పెంచాడు. శ్రేయస్ గోపాల్ తొలి బంతిని లెగ్‌సైడ్‌లో ఫ్లాట్ సిక్స్‌గా మలిచిన అతను తర్వాతి బంతిని లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌గా తరలించాడు. తొలి సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ కోల్పోకుండా 86 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లో ఆర్చర్... ఓపెనర్ సూర్యకుమార్‌తో పాటు కెప్టెన్ రోహిత్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గిపోయింది. మళ్లీ అజేయ పోరాటం... తొలి ఓవర్లోనే రాజస్తాన్ షార్ట్(4) వికెట్‌ను కోల్పోయింది. రహానే క్రీజులోకి రాగా... షరామామూలుగానే బట్లర్ తన నిలకడ కొనసాగించాడు. కుదిరితే బౌండరీతో లేదంటే సింగిల్స్‌తో ఎక్కడా ఇన్నింగ్స్‌ను తడబడకుండా నిలబెట్టాడు. కృనాల్ వేసిన ఐదో ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన బట్లర్ ఆ తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాత హార్దిక్ బౌలింగ్‌లో, బుమ్రా ఓవర్లో కూడా బౌండరీలు బాదాడు. దీంతో రాజస్తాన్ తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బట్లర్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక హార్దిక్ బౌలింగ్‌లో రహానే నిష్క్రమించాడు. తర్వాత బట్లర్‌కు జతైన సంజూ శామ్సన్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. లక్ష్యానికి 4 పరుగుల ముందు అతను నిష్క్రమించగా, సిక్సర్ కొట్టి బట్లర్ రాయల్స్ విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ యాదవ్ (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 38; లూయిస్ (సి) శామ్సన్ (బి) కులకర్ణి 60; రోహిత్ శర్మ (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 0; ఇషాన్ కిషన్ (సి) శామ్సన్ (బి) స్టోక్స్ 12; హార్దిక్ (సి) శామ్సన్ (బి) స్టోక్స్ 36; కృనాల్ (సి) గౌతమ్ (బి) ఉనాద్కట్ 3; కటింగ్ నాటౌట్ 10; డుమిని నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–87, 2–87, 3–108, 4–119, 5–131, 6–166. బౌలింగ్: గౌతమ్ 2–0–23–0, కులకర్ణి 4–0–43–1, ఆర్చర్ 4–0–16–2, స్టోక్స్ 4–0–26–2, గోపాల్ 2–0–21–0, ఉనాద్కట్ 4–0–37–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: షార్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 4; బట్లర్ నాటౌట్ 94; రహానే (సి) యాదవ్ (బి) హార్దిక్ 37; శామ్సన్ (సి) సబ్– చహర్ (బి) హార్దిక్ 26; స్టోక్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–9, 2–104, 3–165. బౌలింగ్: బుమ్రా 3–0–34–1, మెక్లీనగన్ 4–0–28–0, కృనాల్ 4–0–24–0, హార్దిక్ 4–0–52–2, మార్కండే 3–0–32–0 టి20ల్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో సెహ్వాగ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్–2012లో); మసకద్జా (జింబాబ్వే–2012లో), కమ్రాన్ అక్మల్ (లాహోర్ వైట్స్–2017లో) ఈ ఘనత సాధించారు. -
బట్లర్ రికార్డు సెంచరీ
దుబాయ్: పాకిస్తాన్‌తో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ (52 బంతుల్లో 116 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆ దేశం తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (117 బంతుల్లో 102; 8 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. హేల్స్ (22) విఫలమైనా... రాయ్, రూట్ (71 బంతుల్లో 71; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రెండో వికెట్‌కు 140 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాదులు వేశారు. రూట్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇంగ్లండ్ తరఫున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఆరోది. గతంలో ఇంగ్లండ్ తరఫున చేసిన రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు కూడా బట్లర్ పేరిటే ఉండటం విశేషం. కేవలం 16 బంతుల్లోనే రెండో 50 పరుగులు చేసిన బట్లర్... టేలర్ (13)తో కలిసి ఐదో వికెట్‌కు 79; మొయిన్ అలీ (4 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు సమకూర్చడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధ్యమైంది. ఇర్ఫాన్, అజహర్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
సేననాయకే ‘మన్కడింగ్’
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా లంక స్పిన్నర్ సేననాయకే మన్కడింగ్ చేయడం చర్చకు దారితీసింది. 43వ ఓవర్లో జాస్ బట్లర్‌ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి సేననాయకే రనౌట్ చేశాడు. దీన్ని కెప్టెన్ మాథ్యూస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. మన్కడింగ్‌తో సేననాయకే క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీశాడని మాజీ ఆటగాళ్లు విమర్శలకు దిగినా... తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే చేశామని కెప్టెన్ వివరణ ఇచ్చాడు. అంతకుముందే రెండుసార్లు బట్లర్‌ను హెచ్చరించినా వినలేదని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో మన్కడింగ్‌తో ఓ ఆటగాడిని అవుట్ చేయడం ఇది ఎనిమిదోసారి.