ఫిక్సింగ్ గుట్టు విప్పిన విన్సెంట్
వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్‌తో జీవిత కాల నిషేధానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ తాను ఫిక్సింగ్ ఉచ్చులో ఎలా పడ్డాడనే దానిపై తొలి సారి పెదవి విప్పాడు. ప్రస్తుతం మనుగడలో లేని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తోనే ఇది మొదలైందని చెప్పాడు. ‘ఐసీఎల్ కోసం ఇండియా వెళ్లాక ఒక వ్యక్తి తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకొని తన కిట్ వాడకం గురించి డీల్ చేద్దామని పిలిచాడు.
అతని రూమ్‌కు వెళితే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ఆటగాళ్లకు ఎర వేసే ‘హనీ ట్రాప్’ అని నాకు అర్థమైంది. నేను స్పందించకపోవడంతో డాలర్ల కట్టలు నా ముందుంచాడు’ అని విన్సెంట్ వివరించాడు. అయితే ఈ ఘటన గురించి తాను ‘హీరో’గా అభిమానించే మరో ఆటగాడికి చెప్పేందుకు వెళ్లానని, కానీ ఆయన కూడా ప్రోత్సహించడంతో కాదనలేకపోయానని... ఆ తర్వాతా ఫిక్సింగ్‌ను కొనసాగించానని వెల్లడించాడు.
ఐసీఎల్‌తోనే మొదలు!
Published Thu, Jul 3 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement