Lou Vincent
-
దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!
ఐసీఎల్ ఫిక్సింగ్పై విన్సెంట్ సాక్ష్యం ఖండించిన మోంగియా లండన్: ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఫిక్సింగ్ వివాదంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ మరో కొత్త అంశాన్ని తెర మీదికి తెచ్చాడు. ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు సభ్యుల బృందానికి భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా నాయకత్వం వహించాడని అతను వెల్లడించాడు. మోంగియా సూచనలతోనే చండీగఢ్ లయన్స్ జట్టు సభ్యులు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని విన్సెంట్ గుట్టు విప్పాడు. తనతో పాటు ఇతర కివీస్ క్రికెటర్లు క్రిస్ కెయిన్స్, డరైల్ టఫీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని అతను కోర్టులో చెప్పాడు. క్రిస్ కెయిన్స్ ‘మోసపూరిత’ కేసుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న విచారణకు హాజరైన విన్సెంట్... నాటి సంగతులు బయట పెట్టాడు. ఒక్కో మ్యాచ్‌కు తనకు 50 వేల డాలర్లు ఇస్తానని కెయిన్స్ చెప్పినట్లు విన్సెంట్ కుండబద్దలు కొట్టాడు. అయితే ఈ తాజా ఆరోపణలను మోంగియా ఖండించాడు. ‘నేను చండీగఢ్ తరఫున ఆడిన మాట వాస్తవమే. కానీ ముగ్గురు కివీస్ క్రికెటర్లు కలిసి ఏం చేశారనేది నాకు తెలీదు’ అని అతను వివరణ ఇచ్చాడు. 2008లోనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి మోంగియాపై ఐసీఎల్ నిర్వాహకులు నిషేధం విధించినా... సరైన కారణాలు బయట పెట్టలేదు. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన జట్టులో సభ్యుడైన దినేశ్ మోంగియా భారత్ తరఫున 57 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. ఐసీఎల్ నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు అందరికీ క్షమాభిక్ష అందించిన బీసీసీఐ, మోంగియాను మాత్రం పట్టించుకోలేదు. -
ఐసీఎల్తోనే మొదలు!
ఫిక్సింగ్ గుట్టు విప్పిన విన్సెంట్ వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్‌తో జీవిత కాల నిషేధానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ తాను ఫిక్సింగ్ ఉచ్చులో ఎలా పడ్డాడనే దానిపై తొలి సారి పెదవి విప్పాడు. ప్రస్తుతం మనుగడలో లేని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తోనే ఇది మొదలైందని చెప్పాడు. ‘ఐసీఎల్ కోసం ఇండియా వెళ్లాక ఒక వ్యక్తి తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకొని తన కిట్ వాడకం గురించి డీల్ చేద్దామని పిలిచాడు. అతని రూమ్‌కు వెళితే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ఆటగాళ్లకు ఎర వేసే ‘హనీ ట్రాప్’ అని నాకు అర్థమైంది. నేను స్పందించకపోవడంతో డాలర్ల కట్టలు నా ముందుంచాడు’ అని విన్సెంట్ వివరించాడు. అయితే ఈ ఘటన గురించి తాను ‘హీరో’గా అభిమానించే మరో ఆటగాడికి చెప్పేందుకు వెళ్లానని, కానీ ఆయన కూడా ప్రోత్సహించడంతో కాదనలేకపోయానని... ఆ తర్వాతా ఫిక్సింగ్‌ను కొనసాగించానని వెల్లడించాడు. -
నా పేరు విన్సెంట్...నేనో మోసగాడిని
లండన్/వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ లూ విన్సెంట్‌పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం పడింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి క్రికెట్‌ను మోసం చేశానని ఈ ఆటగాడు బహిరంగంగా అంగీకరించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్‌టి20) ఈ నిర్ణయం తీసుకున్నాయి. కౌంటీ మ్యాచ్‌లతో పాటు 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున ఆడుతూ ఫిక్స్ చేసినట్టు విన్సెంట్ అంగీకరించాడు. ‘నాపేరు లూ విన్సెంట్. నేను క్రికెట్‌ను మోసం చేశాను. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నా స్థానాన్ని అనేక సార్లు దుర్వినియోగం చేశాను. మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు పలుమార్లు డబ్బులు తీసుకున్నాను. నేను నా దేశాన్నే కాకుండా, క్రికెట్‌ను, సన్నిహితులను మోసం చేశాను. ఈ విషయంలో తలదించుకుంటున్నాను. నా దేశ ప్రజలకు, ప్రపంచానికి, క్రికెట్ అభిమానులకు, కోచ్‌లకు, ఆటగాళ్లకు క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ 35 ఏళ్ల విన్సెంట్ ఓ ప్రకటన విడుదల చేశాడు. క్రికెట్ కెరీర్లో విన్సెంట్ 23 టెస్టుల్లో 1332 పరుగులు చేయగా ఇందులో 3 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉంది. 102 వన్డేల్లో 2413 పరుగులు చేశాడు. తొమ్మిది టి20లు ఆడాడు. ైనె ట్రైడర్స్తో మ్యాచ్‌లో ఫిక్సింగ్ దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున విన్సెంట్ బరిలోకి దిగి రెండు మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అక్టోబర్ 15న కేప్‌టౌన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ వీటిలో ఒకటి. హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్పాట్ ఫిక్సింగ్ చేశాడు. ఇక కౌంటీ క్రికెట్లో విన్సెంట్ మీద మొత్తం 18 ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉనికిలో లేని ఇండియన్ క్రి కెట్ లీగ్ (ఐసీఎల్)తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ విన్సెంట్ ఫిక్సింగ్ చేశాడు. -
విన్సెంట్ సమాచారమిచ్చింది నిజమే!
ఫిక్సింగ్పై ఐసీసీ ముందే చెప్పిందన్న కివీస్ ఆధారాలు కూడా అందించిన మాజీ క్రికెటర్ వెల్లింగ్టన్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్పై ఐసీసీకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ విశ్వసనీయ సమాచారం ఇచ్చాడన్న విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ తమకు ఎప్పుడో తెలియజేసిందని ఎన్‌జెడ్‌సీ సీఈవో డేవిడ్ వైట్ గురువారం వెల్లడించారు. స్పాట్‌ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల వివరాలను .. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులకు విన్సెంట్ తెలిపాడంటూ లండన్ టెలిగ్రాఫ్ పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో వైట్ స్పందించారు. ‘ఆ పత్రికలో వచ్చిన వివరాలు మాకు తెలిసినవే. ఐసీసీ ఈ విషయాన్ని మాకు ముందే చెప్పింది. కాబట్టి వీటి పట్ల మాకు ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు’ అని వైట్ అన్నారు. పైగా ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లపైగానీ, తమ జట్టు ఆడిన మ్యాచ్లపైగానీ ఎటువంటి విచారణ జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో భాగంగా తమ దేశవాళీ జట్టు ఆక్లాండ్ ఏసెస్ ఆడిన కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లుగా ఐసీసీ తమకు చెప్పినట్లు వైట్ పేర్కొన్నారు. కాగా, దేశవాళీల్లో ఆక్లాండ్ ఏసెస్ తరపున ఆడిన లూ విన్సెంట్.. తనతోపాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు క్రిస్ కెయిన్స్, డారిల్ టఫీలపై కూడా విచారణ జరుగుతోందని గత డిసెంబర్లో తొలిసారిగా వెల్లడించాడు. ఆ తరువాత తనను కొందరు బుకీలు సంప్రదించినట్లు కూడా తెలిపాడు. అయితే టెలిగ్రాఫ్ పత్రిక మాత్రం ఐసీసీకి విన్సెంట్ ఆధారాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, హాంకాంగ్, దక్షిణాఫ్రికాల్లో నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ చోటుచేసుకుందని విన్సెంట్ చెప్పినట్లు తెలిపింది.