దుబాయ్‌లో జరిగిన అజ్మన్ ఆల్ స్టార్స్ లీగ్‌పై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చజరుగుతోంది. ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బ్యాట్స్‌మన్‌లు కావలని అవుటవ్వడం, ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు స్టంపౌట్‌లు, మూడు రనౌట్లు కావడం భిన్న వాదనలకు దారి తీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌పై పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఐసీసీ యాంటీ కరప్షన్ టీమ్‌ను ఆదేశించింది.