PC: IPL Twitter
చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌పై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు పలు విషయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు.
- బౌలర్లు ఈ సీజన్‌లో ఎన్నడూ లేనంత ఉదాసీనంగా వ్యవహరించారని, వికెట్లు తీసి పరుగులు నియంత్రించినప్పటికీ అది వారి స్థాయి కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
- కష్టసాధ్యంకాని లక్ష్య ఛేదనలో (173) బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా వికెట్లు పారేసుకున్నారని, అంపైర్లు కరెక్ట్‌గా లేకపోయినా కెప్టెన్ నుంచి ఎటువంటి స్పందన లేదని అంటున్నారు.
- తెవాతియా, మిల్లర్ నిర్లక్ష్యమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడాన్ని, ఫీల్డర్ మార్చడాన్ని గమనించినా హార్ధిక్ అటువైపే షాట్ ఆడి ఔట్ కావడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు.
- అనుమానాస్పదంగా ఉన్న విజయ్ శంకర్ క్యాచ్‌ను పూర్తిగా పరిశీలించకుండానే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడం, రీప్లేలో బంతి నేలకు తాకినట్లు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని చర్చించుకుంటున్నారు.
- పతిరణ విషయంలోనూ (16వ ఓవర్) అంపైర్లు ధోనికి తలొగ్గారని, రూల్స్ వ్యతిరేకమైనా వారు పతిరణను బౌలింగ్ చేయనిచ్చారని ఆరోపిస్తున్నారు.
- ఎన్నడూ లేని విధంగా గుజరాత్ ఆలౌట్ కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
వీరి ఆరోపణలు, అనుమానాలను పక్కకు పెడితే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడంతో సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. సీఎస్‌కే ఆటగాళ్లు సమష్టిగా రాణించి గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు.
Comments
Please login to add a commentAdd a comment