'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్' | shabbir ali comments on chandrababu, kcr | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'

Published Sun, Jan 31 2016 3:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్' - Sakshi

'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ కేసు ఊసెత్తడం లేదనీ, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను జైలుకు పంపుతానన్న చంద్రబాబు కూడా ఇదే మౌనాన్ని పాటిస్తున్నారన్నారు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

తనవద్ద ఉన్న మున్సిపల్ శాఖను కేటీఆర్కు ఇస్తానన్న కేసీఆర్.. ఆ శాఖను తాను సమర్ధవంతంగా నిర్వహించలేకపోయానని ఒప్పుకున్నట్లేనా షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement