మోడీ, షరీఫ్ కంటే మొనగాళ్లా? | shabbir ali takes on chandra babu naidu,kcr | Sakshi
Sakshi News home page

మోడీ, షరీఫ్ కంటే మొనగాళ్లా?

Published Fri, Aug 1 2014 3:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మోడీ, షరీఫ్ కంటే మొనగాళ్లా? - Sakshi

మోడీ, షరీఫ్ కంటే మొనగాళ్లా?

చంద్రబాబు, కేసీఆర్‌లపై షబ్బీర్‌అలీ ఫైర్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు,చంద్రబాబునాయుడుల స్వార్థరాజకీయాల కారణంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ శాసనమండలి ఉపనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు.  సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి పదవులను అధిష్టించిన వారిద్దరూ ఇకనైనా వాటిని మానుకోవాలని హితవు పలికారు.
 
సీఎల్పీ కార్యాలయంలో షబ్బీర్ అలీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇండియా, పాకిస్థాన్‌లమధ్య ఏళ్లుగా శతృత్వం నడుస్తోంది.. అయినా ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణస్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ఆహ్వానించారు. బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న మోడీ చైనా ప్రధానితోనూ చర్చించారు. వాళ్లకంటే చంద్రబాబు, కేసీఆర్ మొనగాళ్లా? ’ అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement