టీడీపీతో సంకరం!
జోగి..జోగి..రాసుకుంటే బూడిద రాలుతుంది తప్పా మరే విధమైన ప్రయోజనం ఉండదు. ఈ విషయం తెలిసినా డిపాజిట్లు పోకుండా పరువు నిలుపుకోడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు అనైతికంగా జతకడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ రెండు పార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విషయం అర్థంకావడం తో చాలా మంది అభ్యర్థులు ప్రచారంపై కూడా పెద్దగా దృష్టిసారించ డం లేదు. అయితే ఆశ చావని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంకర రాజకీయాలకు తెరలేపారు. టీడీపీతో లోపాయికారీగా చేతులు కలిపారు. తమ ప్రయోజనాలు నెరవేరేందుకు సొంత పార్టీ అభ్యర్థులను బలిపశువులును చేసేందుకు ఆ రెండు పార్టీల నేతలు సిద్ధమయ్యారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇటు చీపురుపల్లి, అటు విజయనగరం నియోజకవర్గాల్లో ఈ గూడుపుఠాణీ వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చీపురుపల్లి నియోజవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురీదుతున్నారు. గెలుపు అవకాశాలు ఏ కోశానా కనిపిం చడం లేదు. అదే నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీచేస్తున్న కిమిడి మృణాళిని పరిస్థితి చెప్పనక్కరలేదు. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మీసాల గీత పరిస్థితి కూడా దీనికి ఏమీ తీసిపోదు. టీడీపీ శ్రేణులు ఆమెను తమ అభ్యర్థిగా గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నయడ్ల రమణమూర్తి అసలు బరిలో ఉన్నారో? లేరో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలలో నేతలు అనైతిక అవగాహనకు వచ్చినట్టు సమాచా రం. చీపురుపల్లిలో దూసుకుపోతున్న వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని బొత్స సత్యనారాయణ ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధమవుతున్నా రు. చీపురుపల్లిలో తనను గెలిపిస్తే, విజయనగరం లో టీడీపీ గెలుపునకు సహకరిస్తానని సంకేతాలు పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని, విజయనగరంలో కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల రమణమూర్తిలను బలిపశువులును చేసేందుకు సిద్ధమవుతున్నారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదటి నుంచీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి ఎదగకూడదని 1989 ఎన్నికల దగ్గరి నుంచి ఓ వర్గం మ్యాచ్ ఫిక్సిం గ్ రాజకీయాలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీరభద్రస్వామికి అప్పట్లో ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఆయన గెలిస్తే తాము ఉనికిని కోల్పోవలసి వస్తుంద న్న భయంతో లోపాయికారీగా వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. అందుకనే, ఎందరి మద్దతు ఉన్నా, ప్రజాదరణతో దూసుకుపోతున్నా కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాల మధ్య వీరభద్రస్వామికి ఇబ్బందేనన్న వాదన ఉంది. కాం గ్రెస్‌ను వీడి, బయటకు వచ్చిన తరువాతే ఆయన విజయం సాధించగలిగారు.
తరువాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై పెద్ద ఎత్తున వచ్చిన వ్యతిరేకత, అభిమానుల కోరిక మేరకు కోలగట్ల తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరారు. చేరుడమే తరువాయి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో ఎన్నిక లు ఏకపక్షమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. పరువు కూడా నిలుపుకోలేని పరిస్థితిని ఎదుర్కొం టున్నాయి. ఇలాగైతే కష్టమన్న అభిప్రాయంతో కాం గ్రెస్ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు దిగారు. టీడీపీతో చేతులు కలుపుతున్నారు.
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను, విజయనగరంలో మీసాల గీతను గెలిపించాలని వారి ఎత్తుగడ. ముఖ్యంగా ఇటీవల చీపురుపల్లిలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ప్రలోభాలకు లొంగిపో యి వెనక్కి తగ్గిన త్రిమూర్తులు రాజు అనుచరులు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జెండాలు మోసి, బ్యానర్లు కట్టి పగలూరాత్రి అనకుండా, మండుటెండలో సైతం పనిచేస్తున్న తమను వెర్రివారిని చేసి నేతులు చేసుకుంట్ను మ్యాచ్ ఫిక్సింగ్‌పై రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. భరించలేక ఆ రెండు పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి వచ్చేస్తున్నారు. ఇటీవల విజయనగరం, చీపురుపల్లిలలో జరిగిన వలసలే దీనికి ఉదాహరణ. ఇలాగైతే గెలవడం కాదు కదా, కనీసం ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.