అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్
Published Fri, Jan 10 2014 1:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైన కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు
సభలో టార్గెట్ వైఎస్సార్
సోనియాను టీడీపీ విమర్శిస్తే అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్
వైఎస్‌పై విమర్శలు చేసినా మౌనం
సభా సంప్రదాయాన్ని పట్టించుకోని వైనం
తెలంగాణకు అనుకూలంగా బాబు ఇచ్చిన లేఖపై టీడీపీ దాటవేత వైఖరి
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు శాసనసభ సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. సమైక్య తీర్మానం చేశాకే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశాక తమ నాటకాన్ని రక్తి కట్టించాయి. విభజన అంశాన్ని పక్కనబెట్టి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టార్గెట్‌గా పనిచేశాయి. బిల్లుపై టీడీపీ సభ్యుడు పల్లె రఘునాథరెడ్డి చర్చను కొనసాగిస్తూ... విభజనకు సోనియాగాంధీయే కారణమని ఆరోపించినప్పుడు కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుపడ్డారు. ఏఐసీసీ నేతల పేర్లు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. సభలో లేని వారి పేర్లను ప్రస్తావించడమే కాకుండా వారిపై విమర్శలు ఎలా చేస్తారని అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో సభలో లేనివారిపై విమర్శలు చేయడం సభా సంప్రదాయం కాదని వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ఒకటికి రెండుసార్లు ప్రకటించారు. ఆ తర్వాత రఘునాథరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావిస్తూ పదేపదే విమర్శలు చేసినప్పటికీ అధికారపక్షం నోరు విప్పలేదు. సభలో లేనివారిపై విమర్శలు చేయడం సరికాదన్న సభాసంప్రదాయాలేవీ ఆ సమయంలో వారికి గుర్తురాలేదు.
వైఎస్‌పై విమర్శలే లక్ష్యంగా...
తెలంగాణ కాంగ్రెస్ నేతలు 2000లో రూపొందించిన ఒక లేఖపై వైఎస్ సంతకం చేశారని, ఆ కారణంగానే తెలంగాణ ఏర్పడిందంటూ రఘునాథరెడ్డి ఆరోపణలు గుప్పించారు. కానీ పార్టీ అధినేత్రి సోనియావద్దకు వెళుతున్నామంటే తామిచ్చిన కాగితంపై ఆరోజుల్లో సీఎల్పీ నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి సంతకం చేశారే తప్ప దానిలో ఉన్న అంశమేంటో ఆయనకు తెలియదని అప్పట్లో ఆ లేఖపై సంతకాలు చేయించిన చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి పలుసార్లు నిర్ద్వంద్వంగా ఖండించిన విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్ నేతలెవరూ గుర్తుచేయలేదు. 2000 సంవత్సరంలో తెలంగాణ నేతల లేఖపై వైఎస్ సంతకం చేశారని ఇప్పుడు ఆరోపిస్తున్న నేతలు 2009లోఆయన హఠాన్మరణం వరకు ఈ ప్రస్తావన తీసుకురాకపోవడం, ఆయన చనిపోయాక మూడేళ్లవరకు కూడా ఎవరూ ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటులో ముడిపడి ఉన్న ఇతర ప్రాంతాల వారి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి ఉభయ సభల సభ్యులతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2009 మార్చి నెలలో మంత్రి కె.రోశయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతీ వారికి గుర్తురాలేదు. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు శాసనసభలో వైఎస్ మాట్లాడుతూ... ‘‘తెలంగాణ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే ముందు దానితో సంబంధం ఉన్న వారు లేవనెత్తిన అభ్యంతరాలు, వారి ఆందోళనలకు పరిష్కారం కావాల్సి ఉంది. అందుకోసమే వాటన్నింటినీ చర్చించడానికి ఉభయ సభల సభ్యుల సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టంగా చెప్పినట్లు ఎవ్వరూ ప్రస్తావించలేదు. ఈ సంయుక్త కమిటీ కోసం టీడీపీ తరఫున పేర్లను సూచించాలని కోరితే దాటవేసిన చంద్రబాబు తీరును ఎవరూ తప్పుపట్టలేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2008 లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది. దానిపై పార్టీ మహానాడు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2008 నుంచి గడిచిన ఐదేళ్లుగా అనేక సందర్భాల్లో చంద్రబాబు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ సభ్యుడు పల్లె రఘునాధరెడ్డి ఆ విషయాన్ని తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించకుండా దాటవేశారు. తెలంగాణపై తొందరగా తేల్చాలని కోరుతూ చంద్రబాబు 2011లో ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి విభజన అంశాన్ని ఆయనే గుర్తుచేసిన విషయాన్ని కూడా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు విస్మరించారు. ఇవన్నీ చూస్తుంటే సభలో చర్చ కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగంగానే ఓ పథకం ప్రకారమే సాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
సోనియూకు ఇచ్చిన లేఖ గురించి వైఎస్‌కు తెలీదు: చిన్నారెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ 2000లో తావుు సోనియూగాంధీనికి రాసిన లేఖ గురించి, అందులోని అంశాల గురించి ఆనాటి సీఎల్పీ నాయుకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలియుదని ఏఐసీసీ కార్యద ర్శి జి.చిన్నారెడ్డి స్పష్టంచేశారు. ఆ లేఖను రాజశేఖరరెడ్డే తవుతో ఇప్పించినట్లు, దానిపై సంతకం కూడా చేసినట్లుగా తెలుగుదేశం నాయుకులు గురువారం శాసనసభలో పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో వూట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వ హయూంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవ్వడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరం సోనియూగాంధీకి లేఖ రాశావుని చెప్పారు. తవు ప్రాంత సవుస్యలపై వైఎస్‌తో చర్చించడమే తప్ప తెలంగాణ రాష్ట్రం కోరుతూ లేఖ రాస్తున్న విషయూన్ని ఆయనకు చెప్పలేదని స్పష్టంచేశారు. అసెంబ్లీలో టీడీపీ చెప్పిన అంశాలన్నీ అబద్ధమేనని ఆయన విమర్శించారు.
Advertisement