అసెంబ్లీ సాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది: వైఎస్ జగన్ | ys jagan mohan reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది: వైఎస్ జగన్

Published Tue, Jun 24 2014 2:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అసెంబ్లీ సాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది: వైఎస్ జగన్ - Sakshi

అసెంబ్లీ సాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది: వైఎస్ జగన్

హైదరాబాద్ : రైతుల రుణమాఫీ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు ప్రస్తుతం కమిటీతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఖరీఫ్ మొదలైనా ఇప్పటికీ రుణాలు అందటం లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మాఫీ కోసం రైతులు చూస్తున్నారని, బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవటంతో ప్రవేయిటుగా మూడు రూపాయిలకు వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు.

రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడిగితే, కేంద్రం, ఆర్బీఐ సహాయం చేయాలని చెపుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేటప్పుడు ఇదే విషయాలు ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. బాబు వస్తే...జాబు వస్తుందని ప్రతి సమావేశంలో చెప్పారని, దాంతో చంద్రబాబు సర్కార్ వస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనలో ఉన్నవారిని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు...ప్రయివేటు ఉద్యోగాలు అంటున్నారన్నారు.  ఆ ఉద్యోగాలు కూడా ఎప్పుడు వస్తాయో కూడా చెప్పటం లేదని జగన్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు నుంచి ఇస్తారో చెప్పటం లేదన్నారు. చంద్రబాబు పాలనలో పరిశ్రమలు మూతపడటం వాస్తవం కాదా, ఉద్యోగులు రోడ్డున పడిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఎప్పటినుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఇస్తారో చెప్పటం లేదని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో 11 వందల కోట్ల యూనిట్లు కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల నిష్పత్తి గురించి తాము చెబితే దాన్ని కూడా తప్పుదోవ పట్టించారని జగన్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తమ అనుయాయి అనే భావన కలిగించే ప్రయత్నం చేశారన్నారు. అదే చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ సర్కారును కాపాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నలు సంధించారు. 2003-2004 సంవత్సరంలో అధికారం నుంచి తప్పుకునేసరికి రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉందని చంద్రబాబు సత్యదూరమైన మాటలు చెప్పారన్నారు. అప్పటికి రాష్ట్రం పూర్తిగా లోటులో ఉందని వైఎస్ జగన్ అన్నారు.

కాంగ్రెస్ సర్కారును కాపాడామని సభసాక్షిగా టీడీపీయే ఒప్పుకుందని జగన్ అన్నారు. 34వేల కోట్ల కరెంట్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, అయితే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాల్సింది పోయి కాంగ్రెస్ను కాపాడామని ఇప్పుడు ఒప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరోజు చంద్రబాబు విప్ జారీ చేయకపోతే కాంగ్రెస్ సర్కారు కచ్చితంగా కూలిపోయేది, రాష్ట్ర విభజన ఆగిపోయి ఉండేదని వైఎస్ జగన్ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement