కరాచీ: పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి ఫిక్సింగ్ వివాదం తెర పైకి వచ్చింది. 2012లో పాక్ జట్టు యూఏఈ పర్యటనలో ఉన్నప్పుడు ఉమర్ అక్మల్‌ను మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా ఓ బుకీ సంప్రదించాడు. అయితే ఈ విషయాన్ని వెంటనే ఉమర్ జట్టు సెక్యూరిటీ మేనేజర్‌కు తెలియపర్చాడు. ‘భారత్‌కు చెందిన నంబర్ నుంచి ఉమర్ అక్మల్‌కు రెగ్యులర్‌గా ఓ కాల్ వచ్చేది. ఫిక్సింగ్ రాకెట్‌లోకి ప్రవేశిస్తే ఊహించనంత డబ్బు ఇస్తానని మూడు సార్లు ఆ బుకీ ప్రలోభపెట్టాడు. అయితే ఈ గుర్తుతెలియని వ్యక్తి గురించి అక్మల్ వెంటనే పాకిస్థాన్ టీమ్ సెక్యూరిటీ మేనేజర్‌కు తెలిపాడు. వారు ఈ అంశాన్ని ఐసీసీ ఏసీఎస్‌యూ ముందుంచారు.
నిజాయితీగా విషయాన్ని వ్యక్తపరిచినందుకు అందరూ అక్మల్‌ను అభినందించారు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఆ పర్యటనలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాక్ 3-0తో గెలుచుకుంది.