మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులో మరో క్రికెటర్‌ | Shafiqullah Shafaq Handed Six Year Match Fixing Ban | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులో మరో క్రికెటర్‌

Published Mon, May 11 2020 11:02 AM | Last Updated on Mon, May 11 2020 11:34 AM

Shafiqullah Shafaq Handed Six Year Match Fixing Ban - Sakshi

కాబూల్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులో మరో క్రికెటర్‌ చిక్కుకున్నాడు. అఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ షఫీఖుల్లా షఫాక్‌పై ఆరేళ్ల నిషేధం పడింది. రెండు లీగ్‌ల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువుకావడంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) వెల్లడించింది. 2018లో ఆరంభమైన అఫ్గాన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో పాటు 2019లో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దీనిపై అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి‌లోని నిబంధ‌న 2.1.1ను అత‌ను ఉల్లంఘించినట్లు తేల్చిన బోర్డు చ‌ర్య‌లు తీసుకుంది. ఫిక్సింగ్‌కు పాల్ప‌డ‌టం లేదా ఫిక్సింగ్ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌డం త‌దిత‌ర అంశాల‌పై త‌న‌ను దోషిగా తేల్చింది. అలాగే నిబంధ‌న 2.1.3ని కూడా ష‌ఫాక్ కూడా అతిక్ర‌మించినట్లు ఏసీబీ తేల్చింది. (‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’)

ఈ నిబంధ‌న ప్ర‌కారం మ్యాచ్ ఫిక్సింగ్ కోసం వివిధ ర‌కాలుగా ప్ర‌య‌త్నించ‌డంతోపాటు బుకీలు త‌న‌ను సంప్ర‌దించిన విష‌యాన్ని ఉద్దేశ పూర్వ‌కంగా దాచిపెట్ట‌డం త‌దిత‌ర అభియోగాలు షఫాక్‌పై నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అతనిపై విచారణ చేపట్టగా అవినీతికి పాల్పడినట్లు అంగీకరించాడు. దాంతో అతనిపై ఆరేళ్ల నిషేధాన్ని విధిస్తూ ఏసీబీ నిర్ణయ తీసుకుంది. అయితే 2009లో అధికారిక అంతర్జాతీయ వన్డే హోదా పొందిన తర్వాత అఫ్గానిస్తాన్‌ నుంచి ఫిక్సింగ్‌కు పాల్పడిన తొలి క్రికెటర్‌గా షఫాక్‌ నిలిచాడు. ఓవ‌రాల్‌గా జాతీయ‌జ‌ట్టు త‌ర‌పున 24 వ‌న్డేలు, 46 టీ20ల‌ను ఆడాడు. చివ‌రిసారిగా బంగ్లాదేశ్‌తో త‌ను ఆడాడు .గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 ఏళ్ల‌ షషాక్ అఫ్గాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు దోషిగా తేలి ఆరేళ్ల నిషేధం ఎదుర్కోవాల్సి రావడంతో షఫాక్‌కు ఇక క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలకు దూరం కానున్నాడు. దాంతో అతని కెరీర్‌ ముగిసినట్లే. 

హార్డ్‌ హిట్టర్‌గా పేరు.. 
అఫ్గాన్‌కు వన్డే హోదా పొందిన క్రమంలోనే అతను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అఫ్గాన్‌ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుగాంచిన షఫాక్‌.. ఆ జట్టు సాధించిన పలు విజయాల్లో భాగమయ్యాడు. ప్రధానంగా ప్రపంచ దృష్టిని అఫ్గాన్‌ క్రికెట్‌ వైపు మళ్లించడంలో షఫాక్‌ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ తరహాలోనే షఫాక్‌ కూడా అఫ్గాన్‌ క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. అంతర్జాతీయ రికార్డులేమీ సాధించకపోయినా దేశవాళీ మ్యాచ్‌ల్లో మాత్రం షఫాక్‌ విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2017లో స్థానిక పారాగాన్ నంగర్‌హార్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన టోర్నమెంట్‌లో షఫాఖ్ ఆకాశామే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 71 బంతుల్లోనే 21 సిక్సర్లు, 16 ఫోర్లతో ఏకంగా 214 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 కావడం  విశేషం. (మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement