Former NZ Cricketer Chris Cairns Reveals Has Been Diagnosed With Bowel Cancer - Sakshi
Sakshi News home page

Chris Cairns: మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన మాజీ క్రికెటర్‌.. గుండెపోటు.. పక్షవాతం.. ఇప్పుడు క్యాన్సర్‌

Published Sat, Feb 5 2022 1:04 PM | Last Updated on Sat, Feb 5 2022 3:50 PM

NZ Former Cricketer Chris Cairns Diagnosed With Bowel Cancer Another Big Shock - Sakshi

chris cairns: న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిర్న్స్‌ మరో చేదు వార్తను పంచుకున్నాడు. తాను క్యాన్సర్‌ బారిన పడినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నాకు పేగు క్యాన్సర్‌ ఉందని వైద్యులు చెప్పారు. సాధారణ చెకప్‌నకు వెళ్లిన నాకు నిజంగా ఇదొక పెద్ద షాక్‌. ఈ విషయం గురించి సర్జన్లు, స్పెషలిస్టులతో మరోసారి చర్చించాను. మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఫాలోవర్లు.. ‘‘అయ్యో.. నీకే ఎందుకిలా జరుగుతోంది కెయిర్న్స్‌’’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా గతేడాది ఆగస్టులో కెయిర్న్స్‌కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ క్రమంలో చాలా రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన అనంతరం కెయిర్న్స్‌ కోలుకున్నాడు. ఇక కివీస్‌ మాజీ టెస్టు ఆటగాడు లాన్స్‌ కెయిర్న్స్‌ కుమారుడైన క్రిస్‌ కెయిర్న్స్‌ న్యూజిలాండ్‌ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు. 1989- 2006 వరకు కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు.    

చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement