క్రిస్ కెయిన్స్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌ను మ్యాచ్ ఫిక్స్ చేయాల్సిందిగా కోరిన మాజీ క్రికెటర్ ‘మిస్టర్ ఎక్స్’ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఫిక్సింగ్ చేసినట్టుగా అంగీకరించిన కివీస్ మాజీ బ్యాట్స్‌మన్ లూ విన్సెంట్ కూడా ఆ ఆటగాడే తనను కూడా కలిశాడని చెప్పాడు.
అయితే అతడి పేరు ఇప్పటిదాకా బహిరంగంగా వెల్లడి కాలేదు.మరోవైపు ఆ మిస్టర్ ఎక్స్ ఆటగాడిని తాను కాదని కివీస్ దిగ్గజం క్రిస్ కెయిన్స్ స్పష్టం చేశాడు. ‘క్రికెట్‌లో అవినీతిపై ఐసీసీ ఏసీఎస్‌యూ విచారణ సాగిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో ఇతరుల చేత నా పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆ ఎక్స్ ప్లేయర్ నేనేనా అని అడుగుతున్నారు. పరిమిత సమాచారం ఆధారంగా నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను మ్యాచ్ ఫిక్సర్‌ను కాదని ఇప్పటికే కోర్టులో నిరూపించుకున్నాను’ అని కెయిన్స్ తేల్చి చెప్పాడు.
ఆ ఆటగాడిని నేను కాదు
Published Wed, May 21 2014 1:07 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement