ఆక్లాండ్: తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ మరోమారు ఖండించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీతో కూడిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపించాడు.
డారిల్ టఫీ, లూ విన్సెంట్‌తో పాటు కెయిన్స్‌పై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో ఎవరూ సంప్రదించలేదని ఈ 43 ఏళ్ల మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు. ‘ఇదంతా నా కెరీర్‌పై, ప్రొఫెషనల్ అవకాశాలపై దారుణంగా ప్రభావం చూపుతోంది. ఈ ఆరోపణలు నాపై ఉన్నంతకాలం నేనే పనీ చేయలేను. ఈ అంశంలో న్యూజిలాండ్ క్రికెట్ కూడా సరిగా వ్యవహరించడం లేదు’ అని అన్నాడు.
దమ్ముంటే సాక్ష్యాలు చూపండి: కెయిన్స్
Published Mon, Feb 10 2014 1:11 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement