A drone saved the life of a 71-year-old man: మనం సాంకేతిక టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే మానవుడిని చంద్రునిపై పాదం మోపేలా చేయగలిగింది. సాంకేతిక సాయంతో ఎన్నో విపత్తుల నుంచి బయటపడగలిగాం. ఇప్పుడు మరి కాస్త ముందడుగు వేసి గుండెపోటుతోనే లేక మరేదైన విపత్కర పరిస్థితిలో ఉన్న మనిషికి డ్రోన్ సాయంతో సేవలందించి కాపాడుకోవచ్చు అంటుంది స్వీడన్‌కి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ.
అసలు విషయంలోకెళ్లితే....కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో అత్యధునిక టెక్నాలజీతో ఆవిష్కరించిన డ్రోన్ సహాయపడింది. స్వీడన్‌లోని ట్రోల్‌హట్టన్‌లో తన ఇంటి బయట మంచు కురుస్తున్నప్పుడు ఒక వ్యక్తి గుండెపోటుకు గురైయ్యాడు. అయితే అప్పుడే డాక్టర్ ముస్తఫా అలీ స్థానిక ఆస్పత్రిలో పనిచేసే నిమిత్తం కారులో డ్రైవింగ్ చేసుకుంటూ అటుగా వస్తున్నాడు. సరిగ్గా ఆసమయానికి ఒక వృద్ధుడి గుండె నొప్పితో కుప్పకూలిపోవడం చూశాడు.
(చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి)
దీంతో అలీ వెంటనే అతనికి సహాయం చేసే నిమిత్తం అతని వద్దకు వెళ్లాడు. అంతేకాదు వెంటనే స్థానిక అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడికి పల్స్ లేకపోవడంతో సీఆర్పీ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయడం ప్రారంభించాడు. అయితే ఇంతలో అతనికి పై నుంచి ఏదో శబ్దం చేసుకుంటూ వస్తుంది ఏంటో అని పైకి చూశాడు. ఒక డ్రోన్ డీఫిబ్రిలేషన్(గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ పరికరం) తీసుకువచ్చి అతని ముంగిట పడేసింది.
ఈ మేరకు అలీ ఆ వృద్ధుడికి డీఫిబ్రిలేషన్‌తో ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత అంబులెన్స్ రావడంతో ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆ వృద్ధుడు మాట్లాడుతూ.."ఇది చాలా విప్లవాత్మక సాంకేతికత. సమయానికి డీఫిబ్రిలేషన్‌ని డ్రోన్ తీసుకురావడంతోనే తాను ప్రాణాలతో సురక్షితంగా ఉన్నాను" అని అన్నాడు. ఈ క్రమంలో ఎవర్‌డ్రోన్ కంపెనీ డ్రోన్ చాలా తక్కువ వ్యవధిలోనే డీఫిబ్రిలేషన్ తీసుకువెళ్లిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment