Swedon
-
What An Idea: గుండె పోటుకి గురైన వృద్ధుడిన కాపాడిన డ్రోన్! ఎలాగంటే..
A drone saved the life of a 71-year-old man: మనం సాంకేతిక టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే మానవుడిని చంద్రునిపై పాదం మోపేలా చేయగలిగింది. సాంకేతిక సాయంతో ఎన్నో విపత్తుల నుంచి బయటపడగలిగాం. ఇప్పుడు మరి కాస్త ముందడుగు వేసి గుండెపోటుతోనే లేక మరేదైన విపత్కర పరిస్థితిలో ఉన్న మనిషికి డ్రోన్ సాయంతో సేవలందించి కాపాడుకోవచ్చు అంటుంది స్వీడన్‌కి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ. అసలు విషయంలోకెళ్లితే....కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో అత్యధునిక టెక్నాలజీతో ఆవిష్కరించిన డ్రోన్ సహాయపడింది. స్వీడన్‌లోని ట్రోల్హట్టన్లో తన ఇంటి బయట మంచు కురుస్తున్నప్పుడు ఒక వ్యక్తి గుండెపోటుకు గురైయ్యాడు. అయితే అప్పుడే డాక్టర్ ముస్తఫా అలీ స్థానిక ఆస్పత్రిలో పనిచేసే నిమిత్తం కారులో డ్రైవింగ్ చేసుకుంటూ అటుగా వస్తున్నాడు. సరిగ్గా ఆసమయానికి ఒక వృద్ధుడి గుండె నొప్పితో కుప్పకూలిపోవడం చూశాడు. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) దీంతో అలీ వెంటనే అతనికి సహాయం చేసే నిమిత్తం అతని వద్దకు వెళ్లాడు. అంతేకాదు వెంటనే స్థానిక అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడికి పల్స్ లేకపోవడంతో సీఆర్పీ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయడం ప్రారంభించాడు. అయితే ఇంతలో అతనికి పై నుంచి ఏదో శబ్దం చేసుకుంటూ వస్తుంది ఏంటో అని పైకి చూశాడు. ఒక డ్రోన్ డీఫిబ్రిలేషన్(గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ పరికరం) తీసుకువచ్చి అతని ముంగిట పడేసింది. ఈ మేరకు అలీ ఆ వృద్ధుడికి డీఫిబ్రిలేషన్తో ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత అంబులెన్స్ రావడంతో ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆ వృద్ధుడు మాట్లాడుతూ.."ఇది చాలా విప్లవాత్మక సాంకేతికత. సమయానికి డీఫిబ్రిలేషన్ని డ్రోన్ తీసుకురావడంతోనే తాను ప్రాణాలతో సురక్షితంగా ఉన్నాను" అని అన్నాడు. ఈ క్రమంలో ఎవర్డ్రోన్ కంపెనీ డ్రోన్ చాలా తక్కువ వ్యవధిలోనే డీఫిబ్రిలేషన్ తీసుకువెళ్లిందని పేర్కొంది. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) -
కాళరాత్రి నరకం: సజీవంగా పాతిపెట్టి..
స్టాక్‌హోమ్ : జాలి, దయ అనేవి అణువంత కూడా లేకుండా ఇద్దరు మగ పిల్లలపై అతి దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు. వారిని కిడ్నాప్‌చేసి, విచక్షణా రహితంగా కొట్టి, అత్యాచారం జరిపి, సజీవంగా పాతిపెట్టారు. చివరకు దుండగుల నుంచి తప్పించుకున్న పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. గత ఆగస్టు నెలలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫొటోలను పోలీసులు గురువారం విడుదల చేశారు. అయితే నిందితుల పేర్లను మాత్రం తెలుపలేదు. చిన్నారులను పాతి పెట్టిన గొయ్యి కేసుకు సంబంధించిన వివరాలు... ఆగస్టు 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు మగ పిల్లలు శ్మశానానికి దగ్గరలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఇద్దరు వ్యక్తులు వారిని సమీపించి డ్రగ్స్ కొంటారా అని అడిగారు. ఇద్దరు పిల్లలు వద్దని చెప్పి, అక్కడినుంచి ముందుకు సాగారు. అయితే వారిని వెంబడించిన దుండగులు కత్తితో బెదిరించి అక్కడికి దగ్గరలోని అడవిలోకి లాక్కెళ్లారు. చిన్నారుల కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకుని, ఎదురు తిరిగితే వారిని చంపుతామంటూ బెదిరించారు. విచక్షణా రహితంగా కొట్టి, శ్మశానంలోకి తీసుకెళ్లారు. అక్కడ వారి బట్టలు విప్పించారు. సెల్ఫోన్లు లాక్కొని దూరంగా పడేశారు. సంఘటనా స్థలం వద్ద చిన్నారుల దుస్తులు చివరకు వారి గొయ్యిని వారే తవ్వుకునేలా చేశారు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఇద్దర్నీ గొయ్యిలో పాతిపెట్టారు. దుండగులు పక్కకు వెళ్లిపోయిన సమయంలో చిన్నారులు గొయ్యిలోనుంచి బయటపడి, అక్కడినుంచి తప్పించుకున్నారు. బట్టలు లేకుండా రోడ్లపై పరిగెత్తసాగారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారులు అందించిన వివరాలతో నిందితుల్ని త్వరగానే అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. -
'మా యాప్‌ను నిషేధించడం అన్యాయం'
స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ట్రూకాలర్ .. కాలర్ ఐడీ.. స్పామ్ డిటెక్షన్, మెసేజింగ్, ఇతర డయలర్ సేవలను అందిస్తున్నది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం తర్వాత 89 రకాల సోషల్ మీడియా యాప్‌లను బ్యాన్ చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో ట్రూకాలర్ యాప్ కూడా ఒకటి. దీనిపై ట్రూ కాలర్ యాప్ యాజమన్యం గురువారం స్పందిస్తూ .. మా యాప్‌ను నిషేధించడం అన్యాయం అని పేర్కొంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ను నిషేధిత దరఖాస్తుల జాబితాలో చేర్చడంపై ఆ సంస్థ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ జాబితాలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్ లు మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, జూమ్, రెడ్డిట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రతా సమస్యలపై ఈ యాప్‌లను తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందికి సూచించింది. 'తమ సిబ్బంది కోసం భారత ఆర్మీ నిషేధించిన 89 యాప్ ల జాబితాలో ట్రూకాలర్ ఉన్నదని తెలుసుకుని నిరాశకు గురయ్యాం. ఇది చాలా అన్యాయం. ట్రూకాలర్ అనేది స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న యాప్.ట్రూకాలర్ యాప్ ను నిషేధిత యాప్ ల జాబితాలో ఉంచాడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తాం. ట్రూకాలర్ ఇండియాలో 170 మిలియన్లకు పైగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్నది. నిత్యం వందల మిలియన్ల స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది' అని ట్రూకాలర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
కరోనా మృతుల శాతం అక్కడే ఎక్కువ!
న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యధికంగా స్వీడన్లు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. మే 13వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకొని విశ్లేషించగా ప్రతి పది లక్షల మందిలో 6.08 మంది చొప్పున మరణిస్తున్నారు. ఇలా మరణాల సంఖ్య బ్రిటన్‌లో 5.57, బెల్జియంలో 4.28, అమెరికాలో 4.11, ఇటలీలో 2.97, స్పెయిన్‌లో 2.62 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే మృతుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే స్వీడన్ కన్నా ఎక్కువ అమెరికాలోనే సంభవించాయి. ఒక్క బుధవారం నాడే ప్రపంచవ్యాప్తంగా 1,06,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారు 51 లక్షలు దాటగా, మరణించిన వారి సంఖ్య మూడు లక్షల 30 వేలను దాటింది. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 15 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 95 వేలకు చేరుకుంది. బ్రిటన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండున్నర లక్షలు దాటగా, మృతుల సంఖ్య 35వేలను దాటింది. అదే స్వీడన్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 31 వేలు దాటగా, మృతుల సంఖ్య 4 వేలకు దగ్గరలో ఉంది. (ప్రపంచంపై కరోనా పంజా) -
ఏపీలో మరో కరోనా పాజిటివ్
సాక్షి, విజయవాడ : స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల 18న ఢిల్లీకి వచ్చిన 28 ఏళ్ల ఆ యువకుడు.. అదే రోజు విజయవాడకు చేరుకున్నాడు. ఈనెల 25న విజయవాడలోని ప్రభుత్వా సుపత్రిలో చేరగా, ఆ యువకుడి నమూనాలను వెంటనే ల్యాబొరేటరీకి పంపించారు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టులో అతని కి కరోనా పాజి టివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి 18వ తేదీ నుంచి ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలన్నీ సేకరిస్తున్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకూ 360 మంది అనుమానిత లక్షణాలున్న వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా అందులో 317 మందికి కరోనా లేదని తేలింది. మరో 32 నమూనాల రిపోర్టుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటి వరకూ 11 మందికి పాజి టివ్‌గా తేలిందని గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా 26,934 మంది ఇంట్లో వైద్య పరిశీలన (హోం ఐసోలేషన్)లో ఉన్నారని, 81 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతు న్నారని పేర్కొన్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని, అనుమానిత లక్షణాలుంటే తక్షణమే 104కు కాల్ చేయాలని ఆ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అనుమానిత లక్షణా లున్న వ్యక్తుల సమాచా రమిస్తే వారిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో చేర్చి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని బులెటిన్‌లో స్పష్టం చేశారు. -
మహిళనైతే దాచుకోవాలా?
స్వీడన్‌లోని ఓ పాఠశాల విద్యార్థిని తన మహిళావాదాన్ని వినూత్నంగా చాటుకుంది. తన తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలో టాప్‌లెస్‌గా కనిపించింది. ఆ ఫోటో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్ దక్షిణ ప్రాంతంలోని వాగ్జో పట్టణంలో హై స్కూల్ విద్యార్థిని హన్నా బొలాండర్(19) ఇటీవల తన తరగతిలోని మిగతా విద్యార్థులతో కలిసి ఫోటోలకు పోజిచ్చింది. అయితే అందరిలా కాకుండా తాను మహిళనైనంత మాత్రాన శరీరాన్నంతా కప్పిఉంచుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తూ.. టాప్‌లెస్‌గా పోజిచ్చింది. దీనిపై హన్నా మాట్లాడుతూ.. పురుషులు తమ శరీరాన్ని వీలైనంత వరకు బయటకు కనిపించేలా చూపిస్తున్నప్పుడు మహిళలు మాత్రం దాచుకోవాల్సిన అవసరం ఏముంది. ఇది కూడా లింగ వివక్షతే. స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కలిగించేందుకే ఈ చర్యకు పూనుకున్నాను' అంటూ వివరించింది. సోషల్ మీడియాలో కొందరు మహిళావాదులు వివక్షపై హన్నా చేస్తున్న వాదనలో నిజం ఉందని వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన తల్లిదండ్రులు ఈ విషయం గూర్చి తెలుసుకొని మొదట కొంత షాక్‌కు గురైనా తరువాత తనను సపోర్ట్ చేశారని చెబుతోంది హన్నా... -
'మా వాళ్లకు నిద్ర లేకుండా డిస్ట్రబ్ చేస్తోంది'
స్టాక్‌హోమ్: స్వీడన్ దేశ భావితరాన్ని సోషల్ మీడియా పట్టి పీడిస్తోందట. వారిని సరిగా నిద్రకూడా పోనివ్వడం లేదట. డిజిటల్ డివైస్‌లను ఉపయోగించడం మూలంగా స్వీడన్ దేశ పిల్లలు, యువకులు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియానే ఆ డివైస్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణం అని స్వీడన్‌కు చెందిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టెలివిజన్ తెలిపింది. నిద్రపోవడానికి ముందు ఆ దేశంలో 82శాతంమంది డిజిటల్ డివైస్‌లను ఉపయోగిస్తూ వారికి నిద్రలేకుండా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ పనిని సమర్థంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం అని, అది కేవలం నిద్ర ద్వారానే సాధ్యం అవుతుందని, ఈ విషయం మరిచిపోయిన యువకులు, చిన్నారులు అనవసరంగా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తలదూరుస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా వీరంతా కూడా 15 నుంచి 29 ఏళ్లలోపు వారే కావడంతో ఓ రకంగా తమ దేశానికి ఆందోళన కలిగించే విషయం అని వెల్లడించింది. అంతేకాకుండా ఐదేళ్లకిందట ఎంతబాగా నిద్రపోయామో ఇప్పుడలా నిద్రపోలేకపోతున్నామని కూడా సగంమంది యువకులు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. దీనంతటికి సోషల్ మీడియానే ప్రధాన కారణం అని కూడా వారు చెప్పినట్లు పేర్కొంది.