సాక్షి, విజయవాడ : స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల 18న ఢిల్లీకి వచ్చిన 28 ఏళ్ల ఆ యువకుడు.. అదే రోజు విజయవాడకు చేరుకున్నాడు. ఈనెల 25న విజయవాడలోని ప్రభుత్వా సుపత్రిలో చేరగా, ఆ యువకుడి నమూనాలను వెంటనే ల్యాబొరేటరీకి పంపించారు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టులో అతని కి కరోనా పాజి టివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి 18వ తేదీ నుంచి ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలన్నీ సేకరిస్తున్నారు.
కాగా, ఏపీలో ఇప్పటివరకూ 360 మంది అనుమానిత లక్షణాలున్న వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా అందులో 317 మందికి కరోనా లేదని తేలింది. మరో 32 నమూనాల రిపోర్టుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటి వరకూ 11 మందికి పాజి టివ్‌గా తేలిందని గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా 26,934 మంది ఇంట్లో వైద్య పరిశీలన (హోం ఐసోలేషన్)లో ఉన్నారని, 81 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతు న్నారని పేర్కొన్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని, అనుమానిత లక్షణాలుంటే తక్షణమే 104కు కాల్ చేయాలని ఆ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అనుమానిత లక్షణా లున్న వ్యక్తుల సమాచా రమిస్తే వారిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చేర్చి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని బులెటిన్‌లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment