సినీ నిర్మాత కృష్ణకాంత్‌ గుండెపోటుతో మృతి  | Producer SK Krishnakanth Deceased At 52 Due To Cardiac Arrest | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత కృష్ణకాంత్‌ గుండెపోటుతో మృతి 

Oct 2 2020 6:30 AM | Updated on Oct 2 2020 7:29 AM

Producer SK Krishnakanth Deceased At 52 Due To Cardiac Arrest - Sakshi

సినీ నిర్మాత కృష్ణకాంత్‌ (52) గుండెపోటుతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేసిన కృష్ణకాంత్‌ తర్వాత తిరుడా తిరిడి చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. తర్వాత శింబు నటించిన మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను నిర్మించారు. ఈయన బుధవారం గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శింబు, టీ రాజేందర్, దర్శకుడు సుబ్రమణ్యంశివ కృష్ణకాంత్‌ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణకాంత్‌ భౌతికకాయానికి గురువారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement