
ప్రముఖ బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ వెల్లడించారు. ఆమె మరణంతో వారి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఓ ప్రదర్శన కోసం షూట్‌లో పాల్గొన్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. వచ్చే వారం మళ్లీ ఆమె షూట్ పాల్గొనాల్సి ఉందని.. కానీ అంతలోనే ఇలా అకస్మాత్తుగా జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
(చదవండి: సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం)
ముంబైలో జన్మించిన తబస్సుమ్ గోవిల్ బాలీవుడ్‌లో బేబీ తబస్సుమ్‌గా పేరు సంపాదించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. 1972 నుంచి 1993 వరకు దాదాపు 21 ఏళ్లపాటు ప్రముఖ దూరదర్శన్ తొలి సెలబ్రిటీ టాక్ షో 'ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్'ను కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. సోమవారం సాయంత్రం ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఆమె కోసం ప్రార్థన నిర్వహించనున్నట్లు మనవరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment