
ప్రముఖ బాలీవుడ్ నటి నిషి సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల(సెప్టెంబర్ 16న) తన 50వ పుట్టినరోజును జరుపుకున్న ఆమె రెండు రోజులకే మృతిచెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా నిన్న ఆమె అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆమె భర్త సంజయ్ సింగ్ తెలిపారు. కాగా ఆమె ఖుబూల్ హై సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ నటికి 21 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
ఆమె భర్త సంజయ్ మాట్లాడుతూ ‘గత కొన్ని వారాలుగా ఆమె గొంతులో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైంది. దీంతో నిషి తినే పరిస్థితి లేక కేవలం ద్రవపదార్థాలు మాత్రమే ఇచ్చాం. ఇటీవల తన 50వ పుట్టినరోజును కూడా నిర్వహించాం. ఆరోజు మాట్లాడలేనప్పటికీ చాలా సంతోషంగా కనిపించింది. తను బ్రతకడానికి చాలా పోరాడింది’ అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment