నా తొలి షూట్ శ్రీదేవితోనే.. బాలీవుడ్ స్టార్ హీరో | My 1st ever acting shot was with Sri Devi says Hrithik Roshan | Sakshi
Sakshi News home page

నా తొలి షూట్ శ్రీదేవితోనే.. బాలీవుడ్ స్టార్ హీరో

Published Sun, Feb 25 2018 2:37 PM | Last Updated on Mon, Feb 26 2018 1:02 PM

My 1st ever acting shot was with Sri Devi says Hrithik Roshan - Sakshi

శ్రీదేవి, హృతిక్‌ రోషన్‌

సాక్షి, ముంబై : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి(54) అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ..  ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ శ్రీదేవితో తనకున్న తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. తాను బాలనటుడిగా తొలి చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించినప్పటి ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమెను ప్రేమతో ఎంతగానో అభిమానించేవాడినని పేర్కొన్నారు.

'నా సినీ ప్రస్థానంలో తొలిసారి తొలి షాట్లోనే శ్రీదేవితో కలిసి నటించా. ఆ సమయంలో ఆమె ముందు నటించడానికి చాలా ఒత్తిడికి గురయ్యా. నాలో విశ్వాసం పెంచడానికి ఆమె తన చెతులను వణికినట్టు చేయడం నాకింకా గుర్తుంది. ఆ సమయంలో నేను కుదురుకునే వరకు ఆమె నన్ను నవ్వేలా చేశారు. ఇద్దరం నవ్వుతూ చాలా సరదగా గడిపాం. శ్రీదేవి అందరిలోకెల్లా అత్యంత అద్భుతమైన నటి. మిమ్మల్ని కోల్పోవడం మాటల్లో వర్ణించలేము. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా మేడమ్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ హృతిక్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement