బస్సులో ప్రయాణిస్తూ.. వ్యక్తి మృతి
Published Wed, Dec 7 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై బస్సులోనే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. ఇల్లందుకు చెందిన దేరంగుల వెంకటేశ్వర్లు(58) బస్సులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన బస్ కండక్టర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Advertisement
Advertisement